శబరిమల అయ్యప్ప ఆలయం ఇవాళ తెరుచుకోనుంది. మకరవిళక్కు కోసం ఆలయాన్ని ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఓపెన్ చేయనున్నట్లు ట్రావెన్కోర్ బోర్డ్ తెలిపింది. ముందుగా ఆలయంలో పవిత్ర దీపాన్ని వెలిగించి.. అనంతరం స్వామివారి దర్శనాలకు భక్తులను అనుమతించనున్నారు. మకరవిళక్కు నేపథ్యంలో భారీగా అయ్యప్ప భక్తులు కొండకు వచ్చే అవకాశం ఉండటంతో.. వారికి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.