SRD: వైకుంఠ ఏకాదశి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఊరేగింపు కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. శ్రీ రామ మందిరం వద్ద టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు సాంప్రదాయ బద్ధంగా పాటలు పాడుతూ పాత బస్టాండ్ మీదుగా ఊరేగింపు కార్యక్రమాన్ని కొనసాగించారు.