SRPT: మునగాల గ్రామ ప్రజలను బెంబేలెత్తిస్తున్న కోతుల బెడదకు స్థానిక గ్రామపంచాయతీ పాలకవర్గం చెక్ పెట్టింది. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై స్పందించిన కొత్త పాలకవర్గం.. కోతులు పట్టే వారిని రప్పించి ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. గత రెండు రోజులుగా గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 100 కోతులను బంధించి, సురక్షితంగా అటవీ ప్రాంతానికి తరలించారు.