ట్రిపుల్ ఆర్ తర్వాత భారీ ప్రాజెక్ట్స్ లైన్లో పెడుతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తున్నాడు. అయితే ఇప్పుడు వార్ 2 సెట్స్ పై ఉండగానే.. మరో భారీ ప్రాజెక్ట్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం.
NTR: ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ఫస్ట్ పార్ట్ అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ఇక దేవర షూటింగ్ చివరి దశలో ఉండగానే.. బాలీవుడ్ మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ ‘వార్2’ షూటింగ్లో జాయిన్ అయ్యాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న యాక్షన్ షెడ్యూల్‌తో బిజీగా ఉన్నాడు తారక్. ఈ వారం, పది రోజుల షెడ్యూల్లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లపై కీలక యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్‌తో భారీ ప్రాజెక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్. రీసెంట్‌గానే దేవర సినిమా నార్త్ థియేట్రికల్ రైట్స్‌ను దక్కించుకున్నాడు కరణ్ జోహార్. అనిల్ తడానీతో కలిసి హిందీలో దేవర రిలీజ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నాడట కరణ్ జోహార్. ఈ విషయంలో దేవర సినిమా నిర్మాణ భాగస్వామిగా ఉన్న కళ్యాణ్ రామ్‌తో రెగ్యులర్ టచ్‌లో ఉంటున్నాడట. వార్ 2 రిలీజ్ అయ్యేలోపు ఎన్టీఆర్‌తో ప్రాజెక్ట్ సెట్ చేయాలని చూస్తున్నట్టుగా బీ టౌన్ వర్గాల సమాచారం.
అయితే ఇప్పటికే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా కమిట్ అయ్యాడు. ఎలాగూ దేవర 2 ఉండనే ఉంది. కాబట్టి.. ఇప్పట్లో కరణ్‌తో తారక్ సినిమా చేస్తాడని ఖచ్చితంగా చెప్పలేం. వార్ 2 రిజల్ట్‌ను బట్టి కరణ్ జోహార్ నిర్మాణంలో ఎన్టీఆర్ సినిమా చేసే ఛాన్స్ ఉంది. కానీ ఫ్యూచర్లో యంగ్ టైగర్ మాత్రం బాలీవుడ్ పై కాస్త గట్టిగానే ఫోకస్ చేసే ఛాన్స్ అయితే ఉంది.