ప్రకాశం: జరుగుమల్లి మండలం దావగూడూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఇవాళ గ్రామ సభ జరగనుందని పంచాయతీ కార్యదర్శి సురేంద్ర తెలిపారు. సర్పంచ్ రామమూర్తి అధ్యక్షతన గ్రామంలో ప్రతి ఇంటిని కొలిచి స్వామిత్వ పథకం ప్రాపర్టీ కార్డ్స్, ఆస్తి పత్రము ఇచ్చే కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. దీనికి సంబంధించిన ఏవైనా అభ్యంతరాలు ఉంటే గ్రామసభలో ప్రజలు తెలియపరచవచ్చన్నారు.