ADB: గ్రామాభివృద్ధి సర్పంచుల చేతుల్లోనే ఉందని ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నూతన సర్పంచుల సన్మానం సభకు ఆమె హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సక్రమంగా అమలు చేస్తే గ్రామాలు మరింత ప్రగతి సాధిస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ గ్రామీణ ప్రజల పక్షానే నిలుస్తుందన్నారు.