• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కష్టపడి తత్వం ఉన్న వ్యక్తి మంత్రి: ఎమ్మెల్యే

MBNR: కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి రాష్ట్ర పశుసంవర్ధక మంత్రి వాకిటి శ్రీహరి అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. ఇవాళ హన్వాడ మండలం హేమ సముద్రం చెరువులో చేప పిల్లల విడుదల కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్ స్థాయి నుంచి అంచలంచలుగా ఎదుగుతూ మంత్రి స్థాయికి శ్రీహరి ఎదిగారన్నారు.

October 25, 2025 / 11:07 AM IST

డీఎస్పీ భార్గవిని కలిసిన దర్గా పీఠాధిపతి

KRNL: కౌతాళం శ్రీ జగద్గురు ఖాదర్ లింగ స్వామి దర్గా పీఠాధిపతి సయ్యద్ మున్నా సాహెబ్ డీఎస్పీ భార్గవిని మర్యాదపూర్వకంగా కలిశారు.  ఆమెకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కౌతాళం దర్గాను సందర్శించాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ అవేద్, రఫిక్, జిలాన్, షాకీర్, షకీల్, బాషా, కిబిరియా, ఖాదర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.

October 25, 2025 / 11:07 AM IST

రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడి కుటుంబంలో విషాదం

VZM: రాష్ట్ర TDP అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఎల్.కోట మండలం గంగుబూడిలో ఉంటున్న ఆయన అత్త జి వెంకటలక్ష్మి శుక్రవారం మృతి చెందారు. ఎమ్మెల్యే లలిత కుమారి శనివారం ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర TDP కార్య నిర్వాహక కార్యదర్శి బాలాజీ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

October 25, 2025 / 11:06 AM IST

‘అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలి’

SS: సత్యసాయి బాబా 100వ జయంతోత్సవాల సందర్భంగా పుట్టపర్తిలో రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు. పడమర గేటు రహదారి, డ్రైనేజీ, శానిటేషన్, వీధిలైట్లు, సీసీ కెమెరాలు, పార్కులు, రహదారులు, వసతి, పార్కింగ్ ఏర్పాట్లను అధికారులు, కాంట్రాక్టర్లను వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

October 25, 2025 / 11:05 AM IST

మత్స్యకారుల అభివృద్ధికి నిధులు మంజూరు: మంత్రి

MBNR: మత్స్యకారుల అభివృద్ధికి అడిగిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.123 కోట్లు మంజూరు చేశారని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఇవాళ హన్వాడ మండలం వేమసముద్రం చెరువులో చేప పిల్లల విడుదల కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకార కుటుంబానికి చెందిన నన్ను ముఖ్య మంత్రి అదే శాఖకు మంత్రిగా చేశారన్నారు.

October 25, 2025 / 11:04 AM IST

నాగుల చవితి జరుపుకున్న స్పీకర్ అయ్యన్న

AKP: రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు శనివారం నాగుల చవితి పర్వదినాన్ని కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా పుట్టల్లో పాలు గుడ్లు వేసి పూజలు చేశారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.

October 25, 2025 / 11:04 AM IST

‘100% పన్నుల వస్తువులపై దృష్టి పెట్టాలి’

PDPL: గ్రామాలలో పరి శుభ్రత, 100% పన్నులవస్తులపై దృష్టి పెట్టాలని జిల్లా పంచాయతీ అధికారి పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా పంచాయతీ అధికారి అధ్యక్షతన బిల్ కలెక్టర్లు, పంచాయతీ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులతో శుక్రవారం సమావేశం జరిగింది. పన్నుల వసూళ్లు, శుభ్రత, ప్రజా సేవలు, హౌసింగ్ పథకాలు వంటి అంశాలపై చర్చించారు.

October 25, 2025 / 11:04 AM IST

కొల్లేరు ఉద్ధృతి.. నీట మునిగిన రహదారులు

W.G: అల్పపీడన ప్రభావంతో 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొల్లేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మండలంలో పెదయడ్లగాడి నుంచి పెనుమాకలంకకు వెళ్లే రహదారి రెండు చోట్ల నీటమునిగి, రోడ్డుపై నుంచి రెండు అడుగుల మేర ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వరద నీరు కొల్లేరుకు చేరుతుండటంతో ఉద్ధృతి పెరిగింది. వంతెన వద్ద గుర్రపుడెక్కను తొలగించినా, సమస్య తిరిగి మొదటికొచ్చిందని వాపోతున్నారు.

October 25, 2025 / 11:04 AM IST

విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తన.. టీచర్ సస్పెండ్

NRML: బాసర మండలంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు అలీపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ముధోల్ CI మల్లేశ్ తెలిపారు. ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించగా, యువకులు గమనించి ప్రశ్నించారు. విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు DEO తెలిపారు.

October 25, 2025 / 11:03 AM IST

కనిగిరి తహసీల్దార్ సస్పెండ్

ప్రకాశం: కనిగిరి తహసీల్దార్ రవిశంకర్‌ను జిల్లా కలెక్టర్ రాజాబాబు సస్పెండ్ చేశారు. ఇటీవల కనిగిరి మండలంలో భూ ఆక్రమణలకు పాల్పడే వారికి సహకరించడంతో పాటు, ప్రభుత్వ భూముల విషయంలో పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలపై విచారణ జరిపించిన కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. మరి కొంతమంది వీఆర్వోలను సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.

October 25, 2025 / 11:02 AM IST

నితీశ్ మూడో వన్డే మిస్.. బీసీసీఐ క్లారిటీ!

ఆస్ట్రేలియాలో మూడో వన్డే కోసం ప్రకటించిన తుది జట్టులో నితీశ్ కుమార్ రెడ్డి పేరు లేదు. దీంతో ఎందుకు అతడిని పక్కన పెట్టారు? అనే సందేహం మొదలైంది. ఈ క్రమంలో నితీశ్ గాయంపై బీసీసీఐ అప్‌డేట్ ఇచ్చింది. ‘రెండో వన్డే సందర్భంగా నితీశ్ ఎడమ తొడ కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో మూడో వన్డే సెలక్షన్ కోసం అతడు అందుబాటులో లేడు. మెడికల్ టీం పర్యవేక్షిస్తోంది’ అని వెల్లడించింది.

October 25, 2025 / 11:02 AM IST

తెగిన వంతెన.. ఆగిపోయిన రాకపోకలు

ASF: ఆసిఫాబాద్ మండలంలోని నందుప వాగుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొట్టుకుపోయింది. ప్రతి సంవత్సరం చలికాలంలో పైపులతో ఈ తాత్కాలిక వంతెనను ఏర్పాటు చేస్తుంటారు. వాగులో నీటి ప్రవాహం పెరగడంతో వంతెన ధ్వంసమై కాగజ్ నగర్‌కు రాకపోకలు ఆగిపోయాయి.

October 25, 2025 / 11:00 AM IST

పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జయప్రద

BHPL: చిట్యాల మండల కేంద్రంలోని కాల్వపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో శనివారం టీచర్ తిరుమల ఆధ్వర్యంలో తల్లుల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ICDS సూపర్వైజర్ జయప్రద హాజరై మాట్లాడుతూ.. చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను మెరుగ్గా అందించాలని సూచించారు. అంగన్వాడీ ద్వారా అందే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

October 25, 2025 / 10:58 AM IST

ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

MBNR: గండేడ్ మండలం అంచన్ పల్లి ప్రాథమిక పాఠశాలను మండల ఎంఈవో రుద్రారం జనార్ధన్ ఇవాళ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ.. వారి సామర్థ్యాలను తెలుసుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లను ఆయన పరిశీలించారు. ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా డైరీ రాయాలన్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

October 25, 2025 / 10:57 AM IST

‘సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలి’

మంచిర్యాల: గ్రామాలలో సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని సీపీఎం జన్నారం మండల కార్యదర్శి కొండగొర్ల లింగన్న కోరారు. శనివారం జన్నారంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడం లేదన్నారు. కార్యదర్శులకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో వారిపై కూడా పనిభారం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

October 25, 2025 / 10:54 AM IST