• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కోట్లు విలువ చేసే డైమండ్ నెక్లస్ ఎత్తుకెళ్లిన ఎలుక.. వీడియో వైరల్

జ్యూయెలరీ షాపులలో దొంగలు పడటం సహజమే కానీ.. ఆ దొంగలు మనుషులు కాకుండా వేరే అయితే అప్పుడు ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. తాజాగా ఓ గోల్డ్ షాపులో ఎలుక దొంగతనం చేసింది. అది కూడా ఏదో చిన్న దొంగతనం కాదండోయ్. పెద్దదే. వస్తువు చిన్నదే అయినా అది ఎత్తుకెళ్లింది చాలా కాస్ట్‌లీ ఐటెమ్. అదే డైమండ్ నెక్లస్. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #अब ये चूहा डायमंड का नेकलेस किसके [&hel...

February 5, 2023 / 08:32 PM IST

జగన్ రెడ్డి ఈ పథకాలను చంపేశాడు: లోకేశ్

  టీడీపీ నేత నారా లోకేశ్(nara lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర జోరుగా కొనసాగుతుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో పాదయాత్రలో భాగంగా లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై మండి పడ్డారు. యువతకు ఉద్యోగాలు రావాలన్నా మన ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నా…సైకో పోయి సైకిల్ రావాలని లోకేశ్ వ్యాఖ్యానించారు. నాడు నేడు అంటూ హడావిడి తప్ప అభివృద్ధి ఏం చేయడం లేదని ఆరోపించారు. గతంలో ప్రజలతో మాట్లాడిన సీఎం ...

February 5, 2023 / 07:58 PM IST

న్యూయార్క్, లండన్‌లో కరెంట్ పోయినా హైదరాబాద్‌లో పోదు : కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ మహారాష్ట్రలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. నాందేడ్‌లో ఇవాళ మధ్యాహ్నం భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. ఈసందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో కిసాన్ సర్కార్ రావాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేశారు. బహిరంగ సభ అనంతరం నాందేడ్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే ఏం చేస్తుంద...

February 5, 2023 / 07:20 PM IST

అన్ స్టాపబుల్ విత్ పవన్ కల్యాణ్ ప్రొమో పార్ట్ 2…కేక

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్ స్టాపబుల్ బాలయ్య విత్ పవన్ కల్యాణ్ ప్రొమో పార్ట్ 2 వచ్చేసింది. ఈ ప్రొమోలో పవన్ కల్యాణ్ ను బాలకృష్ణ క్రేజీ ప్రశ్నలు అడిగారు. అసలు జేబులో చేతులు ఎందుకు పెట్టుకుంటారని బాలయ్య అడిగి..మళ్లీ ఎవరిని కొట్టకుండా ఆపుకోవడానికే పెట్టుకుంటున్నారా అని NBK చమత్కరిస్తాడు. ఆ తర్వాత కారుపైన కూర్చుని వెళ్లడం గొడవ ఎంటి? టీడీపీతో పొత్త పెట్టుకుంటారా? అసలు మ...

February 5, 2023 / 07:21 PM IST

వైజాగ్ టు హైదరాబాద్ వందే భారత్ రైలులో నాణ్యత లేని ఫుడ్.. ప్రయాణికుల ఆగ్రహం.. వీడియో

గత నెలలోనే కదా వైజాగ్ టు హైదరాబాద్ వందే భారత్ ట్రెయిన్‌ను లాంచ్ చేసింది. ఈ ట్రెయిన్ లాంచ్ అయి నెల కూడా కాలేదు. అప్పుడు రైలుపై పలు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇటీవల ట్రెయిన్‌లో ప్రయాణికులు చెత్త, వాటర్ బాటిల్స్ పడేసి.. రైలు మొత్తాన్ని చెత్తతో నింపేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది కదా. ఆ ఫోటోపై రైల్వే శాఖ వెంటనే స్పందించింది. రైలులో చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా సహాయక సిబ్బందిని […]

February 5, 2023 / 06:49 PM IST

అశోక్ గల్లా రెండో చిత్రానికి క్లాప్ కొట్టిన విక్టరీ వెంకటేష్

  హీరో మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా రెండో చిత్రం మొదలైంది. ఈ చిత్ర పూజా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన హీరో విక్టరీ వెంకటేష్ ఓ సీన్ సన్నివేశానికి క్లాప్ కొట్టగా..నమ్రతా శిరోద్కర్ కెమెరా స్విఛాన్ చేశారు. ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు జాంబిరెడ్డి ఫేం ప్రశాంత్ వర్మ స్టోరీ అందిస...

February 5, 2023 / 06:37 PM IST

58 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి కొడవలితో చంపేసిన 16 ఏళ్ల బాలుడు

మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలుడు 58 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి చంపేశాడు. రేవా జిల్లాలోని కైలాష్ పురి అనే గ్రామంలో జనవరి 30న ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళ నోట్లో గుడ్డను కుక్కిన ఆ బాలుడు.. తనను నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ దగ్గరికి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆ మహిళపై కొడవలితో దాడి చేశాడు. ఆ మహిళకు పరిచయం ఉన్న బాలుడే దారుణంగా ఆమెను దారుణంగా చంపేశాడని […]

February 5, 2023 / 06:13 PM IST

ఉడకబెట్టిన కోడిగుడ్లు తిని 12 మంది విద్యార్థులకి అస్వస్థత.. ఎక్కడంటే?

సాధారణంగా ఉడకబెట్టిన కోడిగుడ్లు తింటే ఆరోగ్యానికి చాలామంచిది. కానీ.. కోడిగుడ్లను ఎక్కువ రోజులు నిలువ చేసి వాటిని ఆ తర్వాత తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. తాజాగా తమిళనాడులో అదే జరిగింది. రామంతపురంలోని శివనంతపురంలో ఉన్న ఓ మునిసిపల్ ప్రైమరీ స్కూల్‌కు చెందిన విద్యార్థులు ఉడకబెట్టిన గుడ్లు తిని అస్వస్థతకు గురయ్యారు. 12 మంది విద్యార్థులు గుడ్లు తినగానే మొత్తం కడుపులో తిప్పి మొత్తం బయటికి కక్కారు. ఆ...

February 5, 2023 / 05:34 PM IST

ఆ బ్రిడ్జి కింది నుంచి చేపల బోట్లకు అనుమతి.. వీడియో

రామేశ్వరం అనగానే మనకు గుర్తొచ్చేది పంబన్ బ్రిడ్జి. అది రైల్వే సస్పెన్షన్ బ్రడ్జి. సముద్రంలో ఉండే ఆ బ్రిడ్జి మీదుగా రైలు వెళ్తుంటే చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అదే ట్రెయిన్‌లో బ్రిడ్జి మీద ప్రయాణం చేయడం కూడా ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. అయితే.. ఆ పంబన్ బ్రిడ్జి కింది నుంచి కేవలం నావీ వాళ్ల షిప్‌లనే ఇప్పటి వరకు పంపించేవారు. కానీ.. తాజాగా ఫిషింగ్ బోట్స్‌ను కూడా పంపిస్తున్నారు. ఆ బ్రిడ్జిని ద...

February 5, 2023 / 05:08 PM IST

24 గంటల కరెంట్ నిరూపిస్తే క్షమాపణ చెప్తా: జీవన్ రెడ్డి

  తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(jeevan reddy) విమర్శలు గుప్పించారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం పచ్చి అబద్దాలు చెబుతుందని వెల్లడించారు. అలా ఇస్తున్నామని నిరూపిస్తే తాను ప్రభుత్వానికి క్షమాపణ చెబుతానని స్పష్టం చేశారు. ప్రతి సబ్ స్టేషన్లో కరెంట్ రికార్డులు ఉంటాయని…అన్ని సబ్ స్టేషన్ల పరిధిలో ఇస్తున్న కరెంట్ రికార్డులపై శ్వేత పత్రం విడుదల చేయ...

February 5, 2023 / 04:47 PM IST

ముషారఫ్ పై శశిథరూర్ ప్రశంసలు, బిజెపి ఆగ్రహం

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మృతి చెందిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన యూఏఈలోని హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్ను మూశారు. పాకిస్థాన్‌కు పదో అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మృతి నేపథ్యంలో కాంగ్రెస్ నేత శశిథరూర్ స్పందిస్తూ.. ప్రశంశలు కురిపించారు. ముషారఫ్ ను ప్రశంసించిన కాంగ్ ఎంపీ శశి థరూర్‌ పై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముషారఫ్ మృతిపై శ...

February 5, 2023 / 04:36 PM IST

ఆర్థికశాఖ పెత్తనం జగన్‌దే.. యనమల వ్యాఖ్యలపై బుగ్గన ఫైర్

సీఎం జగన్‌పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం ఇచ్చే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. ఆర్థికశాఖలో అసలు ఏం జరుగుతోందో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి తెలుసా? అని ప్రశ్నించారు. ఆర్థికశాఖపై పెత్తనం అంతా సీఎం జగన్ దేనని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. బహిరంగ మార్కెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు ఎంత, చెల్లించిన వడ్డీ ఎంత? అని యనమల ...

February 5, 2023 / 04:13 PM IST

చైనా బజార్లు పోవాలి.. భారత్ బజార్లు రావాలి : కేసీఆర్

మహారాష్ట్రలోని నాందేడ్‌లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ చూసినా చైనా బజార్లు ఉన్నాయని.. మేక్ ఇన్ ఇండియా ఎక్కడ పోయింది. చైనా బజార్లు పోయి.. భారత్ బజార్లు రావాలని సీఎ కేసీఆర్ స్పష్టం చేశారు. భారత్ పేద దేశం కాదు. చిత్తశుద్ధితో పని చేస్తే అమెరికా కంటే బలమైన దేశంగా ఎదగొచ్చు. విస్తీర్ణంలో అమెరికా మనకంటే చాలా పెద్దది. కానీ.. వ్యవసాయానికి పనికొచ్చే భూమి లేదు...

February 5, 2023 / 04:11 PM IST

చెల్లికి న్యాయం చేయని జగన్ రాష్ట్రానికి చేస్తాడా?: లోకేష్

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆదివారం పదో రోజుకు చేరుకుంది. నేడు పూతలపట్టు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రి మంగసముద్రంలో బస చేస్తారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. రాష్ట్రంలోని ఆడ బిడ్డలు క్షేమంగా ఉండేది టీడీపీ పాలనలోనే అన్నారు. జగన్‌కు ఒక్క ఛాన్సు ఇస్తే రాష్ట్రాన్ని ఏ దుస్థితిలోకి తీసుకొచ్చారో చూస్తూనే ఉన్నామని చెప్పారు. పెన్షన్లు తీసేయడం, మద్య...

February 5, 2023 / 04:09 PM IST

గర్వంగా, గౌరవంగా ఆస్తులు సంపాదించుకున్న..శిల్ప రవి ఫైర్

నంద్యాల జిల్లాలో భూమా అఖిలప్రియ వర్సెస్ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. రవి అక్రమాలు చేశారని అఖిలప్రియ ఆరోపణలు చేయగా.. ఎమ్మెల్యే ధీటుగా స్పందించారు. అక్రమాలకు సంబంధించి ఆధారాలు చూపించాలని కోరారు. తన ఆస్తుల విలువ పెరిగితే మీకెందుకు బాధ? అని ప్రశ్నించారు. తాను గౌరవంగా, గర్వంగా ఆస్తులు సంపాదించుకున్నానని శిల్ప రవి వివరించారు. తన ఇల్లు, నంద్యాల ఆస్తులకు సంబ...

February 5, 2023 / 03:43 PM IST