ADB: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
W.G: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయనను పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మర్యాదపూర్వకంగా కలిశారు. డీజీపీకి పూల మొక్క అందజేశారు. అనంతరం ఎస్పీ నయిం జిల్లాలోని లా అండ్ ఆర్డర్ గురించి డీజీపీకి వివరించారు.
JN: స్టేషన్ ఘన్‌పూర్ మండల కేంద్రంలోని శ్రీ తిరుమలనాథ దేవస్థానం ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ ఆంజనేయస్వామి దేవాలయానికి స్టేషన్ ఘణపూర్ మాజీ ఎంపీటీసీ గోనెల ఉపేందర్ ముదిరాజ్ కుటుంబ సమేతంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ నిర్మాణానికి రూ.1 లక్షలను ఆలయ ప్రధాన అర్చకులు కలకోట రామానుజాచర్యులుకి విరాళంగా అందజేశారు.
KMR: వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలని డీఆర్డివో పిడి సురేందర్ అన్నారు. లింగంపేట్ మండల పరిషత్ కార్యాలయంలో మిషన్ భగీరథ ఇంట్రా గ్రిడ్, పంచాయతీ అధికారులతో తాగునీటి సరఫరాపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ELR: గణపవరం గ్రామ దేవత దండు మారెమ్మ అమ్మవారిని ఆదివారం ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు దర్శించుకుని పూజలు చేశారు. జరగబోయే జాతర మహోత్సవాలకు జనసేన నాయకులు లక్ష రూపాయలు విరాళాన్ని ఎమ్మెల్యే ధర్మరాజుకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజును సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు, మండలం కూటమి నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
సత్యసాయి: సోమందేపల్లి మండలంలో నూతన ఆర్టీసీ బస్టాండుకు మోక్షం కలిగేలా లేదు. 2003లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర మంత్రి దివంగత పరిటాల రవీంద్ర ఈ బస్టాండుని ప్రారంభించారు. అయితే అప్పటి నుండి ప్రభుత్వాలు మారాయి కాని నేటికి ఈ బస్టాండు వాడుకలోకి రాలేదు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక సెప్టెంబరు 23న ఆర్టీసీ అధికారులు ఈ బస్టాండుకి రంగులు వేసి వదిలేశారు.
KMR: తాడ్వాయి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాగయ్య ఎంఆర్పీఎస్ సభకు డప్పులతో రావాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం నుంచి ఒక్కొక్కరు డప్పులతో హైదరాబాద్ తరలి లక్ష డప్పుల మాదిగ గుండె చప్పుడు సభను విజయవంతం చేయాలని కోరారు. ప్రతి గ్రామం నుంచి బస్సులు వస్తున్నాయని ప్రతి ఒక్కరూ తరలి వచ్చి ముందు కృష్ణ మాదిగకు మద్దతు తెలిపాలి.
ATP: ఉరవకొండ టీడీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఉరవకొండ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆయనకు అర్జీలను సమర్పించారు. మంత్రి కేశవ్ మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.
ADB: కవ్వాల్ అభయారణ్యంలో భారీ వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ జన్నారం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మేకల మాణిక్యం కోరారు. ఆదివారం జన్నారంలో వారు మీడియాతో మాట్లాడుతూ.. అభయారణ్యంలో భారీ వాహనాలను అనుమతించక పోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. రాత్రివేళల్లో లోకల్, నాన్ లోకల్ వాహనాలను కూడా అటవీ అధికారులు అనుమతి ఇవ్వాలన్నారు.
W.G: ఉమ్మడి ప.గో జిల్లాలో భారీ సంఖ్యలో కోళ్లు మృతి చెందడం కలకలం రేపుతోంది. అంతుచిక్కని వైరస్ డిసెంబర్‌లో మొదలై జనవరి నుంచి విజృంభిస్తోందని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. ఇప్పటికే లక్షకు పైగా కోళ్లు చనిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాంపిల్స్ భోపాల్ పంపుతున్నారు. 2012, 2020 లోనూ ఈ వైరస్ వచ్చిందని, ప్రభుత్వం విపత్తుగా పరిగణించాలని కోరుతున్నారు.
KMR: గురుకుల పాఠశాలలో చేరేందుకు ప్రభుత్వం గడువు పొడిగించినట్లు బిక్కనూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రఘు తెలిపారు. 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు అడ్మిషన్లు పొందేందుకు ఆన్‌లైన్ ద్వారా ప్రవేశ పరీక్ష కోసం ఈనెల 9 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ST, SC, BC మైనార్టీ గురుకులాలలో చదివే విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.
పశ్చిమ బెంగాల్ హౌరాలో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన భర్త కిడ్నీని బలవంతంగా రూ.10 లక్షలకు అమ్మించి డబ్బు తన వద్దే ఉంచుకుంది. తన కూతురి చదువుకు ఉపయోగపడుతుందని చెప్పడంతో భర్త గుడ్డిగా నమ్మాడు. కానీ, ఆ మహిళ తన భర్తను నిలువునా ముంచి రాత్రికి రాత్రే ప్రియుడితో డబ్బు తీసుకొని పరారైంది. దీంతో భర్త పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
విశాఖలోని ఆశిల్ మెట్ట వద్ద గల యూనియన్ బ్యాంకులో శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడ చేరుకొని మంటలు ఆర్పి వేశారు. బ్యాంకులో ఏసీ ఆఫ్ చేయకపోవడం వల్లే మంటలు వ్యాపించినట్లు ప్రాథమిక విచారణ ద్వారా తేల్చారు. బ్యాంకులో ఏసీ, ఫర్నిచర్ మంటల్లో కాలిపోయాయి.
SRPT: గొర్రెల, మేకలను దొంగలిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు చౌటుప్పల్ ACP మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఆత్మకూరు(M) కాప్రాయిపల్లిలో చేపట్టిన వాహన తనిఖీల్లో పట్టుబడినట్లు వెల్లడించారు. NLG జిల్లాకు చెందిన వెంకటేశ్, రావుల శివ, శ్రీనివాస్ రెడ్డి, విజయ్ ప్రసాద్‌లు ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారన్నారు. వీరికి సహకరించిన శారద, నందినిలు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
NLG: చిట్యాల మండలంలోని వట్టిమర్తి జిల్లా పరిషత్ హైస్కూల్లో శనివారం వట్టిమర్తి మాజీ సర్పంచ్ రాచమల్ల రామచంద్రం స్మారకార్థం విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెన్నులు, ప్యాడ్‌లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్ల మహేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు జిట్ట సురేష్ తదితరులు పాల్గొన్నారు.