VZM: డెంకాడ పోలీసు స్టేషన్ పరిధిలో ప్రమాదాలు జరగకుండా ఎస్సై ఏ.సన్యాసి నాయుడు ప్రత్యేక చొరవతో ముఖ్యమైన కూడళ్లలో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాన రహదారి కావడంతో ముందుస్తు చర్యలలో భాగంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ముందుగా గుర్తించి బంగారు వర్తకులతో మాట్లాడి ఫ్లెక్సీలను తయారు చేసి ప్రధాన కూడళ్ళలో ఏర్పాటుచేసినట్లు తెలిపారు.
AKP: జిల్లాలోని చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు సెలవు రోజుల్లోనూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎంఈవో మూర్తి ఆదివారం వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ సెలవు రోజుల్లో నిర్వహించే తరగతుల్లో మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. అలాగే పండగ సెలవులే కాకుండా రెండవ శని ఆదివారాల్లోనూ విద్యార్థులకు తరగతులు జరుగుతాయన్నారు.
TPT: వడమాలపేట మండలం సీతారాంపేట పంచాయతీ ప్రజలు ఆదివారం ఉదయం నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌కు రూ.50 వేల చెక్కును అందజేశారు. అమరావతి నిర్మాణానికి రూ.50 వేల చెక్కు అందజేసినట్లు టీడీపీ మండల అధికార ప్రతినిధి ధనంజేయులు నాయుడు తెలిపారు. ఈ కార్య క్రమంలో గ్రామకంఠం అద్యక్షులు దేవరాజులు నాయుడు, హరిప్రసాద్ పాల్గొన్నారు.
అన్నమయ్య: మదనపల్లెలోని జడ్పీ హై స్కూల్లో గణిత శాస్త్ర ఉపాధ్యాయులైన ఒంటి కొండ చలపతి నాయుడుకి అరుదైన గౌరవం దక్కింది. గణిత శాస్త్రంలో విద్యార్థులకు సులువైన పద్ధతిలో అత్యుత్తమ బోధన చేస్తున్నందుకు తెలుగు వెలుగు వారు పురస్కారానికి ఎంపిక చేశారు. ఆదివారం విజయవాడలోని తుమ్మల కళాక్షేత్రం నందు ఆయనకు కాళోజి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ పురస్కారాన్ని అందజేశారు.
SKLM: రథసప్తమి వేడుకల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన డ్రాయింగ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులను ఆదివారం డచ్ భవనం వద్ద కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభినందించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఉచిత హెలీ టూరిజం విహారానికి అవకాశం కల్పించారు. విద్యార్థులను దగ్గరుండి హెలికాప్టర్ ఎక్కించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు.
అన్నమయ్య: అంగళ్లు సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్‌సీసీ క్యాడెట్స్ ఆదివారం హార్సిలీ హిల్స్ నందు ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఎన్‌సీసీ లెఫ్ట్‌నెంట్ ఎన్.నవీన్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ట్రెక్కింగ్ వల్ల విద్యార్థుల్లో ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తి అలవడుతాయని తెలిపారు. 35వ ఎన్‌సీసీ బెటాలియన్ చిత్తూరు వారు పాల్గొన్నారు.
SKLM: తండేల్ కథ నిజంగా శ్రీకాకుళం జిల్లాలోని జరిగిందని హీరో నాగచైతన్య మూవీ ప్రమోషన్‌లో ఆదివారం వెల్లడించారు. శ్రీకాకుళం వెళ్లి అక్కడి జీవన విధానాన్ని పరిశీలించానని హీరో నాగ చైతన్య అన్నారు. అలాగే ఆ సంఘటన గురించి వినగానే చాలా ఆసక్తిగా అనిపించిందని చెప్పుకొచ్చారు. అవి నిజంగా జరిగాయి. అందుకే ఈ తండేల్ కథలో నిజాయితీ ఉంది అని పేర్కొన్నారు.
SKLM: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మార్చి 8 తేదీ వరకు ఆయా సోమవారాలలో నిర్వహించే గ్రీవెన్స్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక – గ్రీవెన్స్) రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. తదుపరి గ్రీవెన్స్ నిర్వహణ తేదీని ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.
అన్నమయ్య: నిన్న సీఎం చంద్రబాబు సభలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మాధవ్ ప్రజా సమస్యలపై నినాదాలు చేస్తే అరెస్టు చేయడాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి పీఎల్ నరసింహులు ఖండిస్తున్నామన్నారు. ఆయన మాట్లాడుతూ మదనపల్లె మెడికల్ కళాశాలను ప్రైవేటుపరం చేయకూడదని అలాగే బీటీ కళాశాలను యూనివర్సిటీ చేయాలంటూ నినాదాలు చేశారన్నారు. మాధవ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రకాశం: సంతమాగులూరు పోలీస్ స్టేషన్ నందు మహిళల సౌకర్యం కోసం ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని సంతమాగులూరు ఎస్సై పట్టాభి రామయ్య చెప్పారు. వివిధ సమస్యల మీద పోలీస్ స్టేషన్‌కు వచ్చే మహిళలకు ప్రత్యేక డేస్క్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. సమస్యల మీద స్టేషన్‌కు వచ్చే మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
KRNL: నందికొట్కూరు పట్టణంలోని నీలి సికారి పేటలో టౌన్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నాటు సారా బట్టిలపై దాడులు నిర్వహించారు. నాటుసారా తయారు చేస్తున్న బట్టిలను ధ్వంసం చేశారు. బిందెలలో ఉన్న బెల్లపు ఊట కూడా నాశనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
అన్నమయ్య: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ కోసం కోట్ల రూపాయలను దుబారా చేస్తున్నారని ఈ రోజు రాయచోట్ల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రతి నెల సాధారణంగా జరిగే పెన్షన్ కార్యక్రమానికి ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతూ చంద్రబాబు ప్రభుత్వ ధనాన్ని దుబారా ఖర్చు చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
U-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత్ విశ్వ విజేతగా అవతరించింది. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన SA 82 పరుగులకు ఆలౌటైంది. ఛేజింగ్‌లో మన తెలుగమ్మాయి త్రిష(44) రాణించడంతో.. భారత్ కేవలం 11.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచి ప్రపంచ కప్ సొంతం చేసుకుంది.
ఢిల్లీ ఎన్నికల వేళ ఆప్ చీఫ్ కేజ్రీవాల్ రాష్ర ప్రజలకు సూచనలు చేశారు. ‘ఉచ్చులో పడకండి, డబ్బు తీసుకోండి కానీ వారికి ఓటు వేయకండి. జుగ్గి(మురికివాడ) నివాసితులను రూ.3 వేల పథకం, ఎన్నికల కమిషన్ ద్వారా ఇంటి వద్ద నుంచే ఓటింగ్ హామీతో బీజేపీ తప్పుదారి పట్టిస్తోంది. ఇంటింటికీ వెళ్లి బీజేపీ వాళ్లు డబ్బు తీసుకుని ఓటు వేయాలని అడుగుతున్నారని నాకు కాల్స్ వస్తున్నాయి’ అని తెలిపారు.
JN: జనగామ మండలం పసరమడ్ల గ్రామానికి చెందిన దూడల బాలసిద్దులు కృత్రిమ కాలు పెట్టడానికి డబ్బులు అవసరం పడగా, నిరుపేద కుటుంబం కావడంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ మంత్రి కొన్న ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్ళగా వెంటనే స్పందించి రూ. 1,25,000 మంజూరు చేయించారు. వారి కుటుంబానికి కిరణ్ ఈరోజు LOC పత్రాన్ని అందజేశారు.