కడప: జిల్లా వ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. జిల్లాలోని కొండాపురం, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు తదితర ప్రాంతాల్లో సరస్వతి దేవి విగ్రహాలు, చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారులచే అక్షరాభ్యాస కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా అర్చకులు వసంత పంచమి పండుగ విశిష్టతను తెలిపారు.
HYD: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి సంపత్‌నగర్, ఊట్పల్లిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. సంపత్‌నగర్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమించి కబ్జా చేసిన కట్టడాలు, ఊట్పల్లిలో రోడ్డును ఆక్రమించి అడ్డంగా గేటు ఏర్పాటు చేయడంతో చర్యలు ప్రారంభించారు. నాలాలు, చెరువులను కబ్జా చేస్తే సహించేది లేదని అధికారులు హెచ్చరించారు.
ప్రకాశం: ఒంగోలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్నట్లు కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు చెప్పారు. మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జరగనున్న సాధారణ సమావేశంలో 29 అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద కేటాయించిన నిధులతో చేపట్టిన పనుల ఆమోదం, ముస్లిం షాదీఖానా స్థలం అంశాలపై చర్చ ఉంటుందన్నారు.
TG: వసంత పంచమి వేడుకల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విద్యాసంస్థలకు ఆప్షనల్ హాలిడే ప్రకటించింది. దీంతో పలు హిందుత్వ, ఆధ్యాత్మిక సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే స్కూళ్లకు నేడు సెలవు ఉండనుంది. అలాగే, సెలవు ఇవ్వాలా లేదా అనేది స్కూళ్ల యాజమాన్యాలు నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. మరోవైపు ఏపీలో ఎలాంటి హాలీడే ప్రకటించలేదు.
ASR: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం జరగాల్సిన మీ కోసం (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేసినట్లు పీవో కట్టా సింహాచలం తెలిపారు. అన్ని మండలాల్లో జరగాల్సిన గ్రీవెన్స్ కార్యక్రమాలు రద్దు చేశామన్నారు. ఐటీడీఏలో జరిగే డివిజన్ జై గ్రీవెన్స్ సైతం రద్దు చేశామన్నారు.
VZM: గంజాయి, మాదక ద్రవ్యాల వంటివాటి బారిన పడకుండా యువత జాగ్రత్తలు పాటించాలని రూరల్ ఎస్ఐ వి. అశోక్ కుమార్ పిలుపు నిచ్చారు. స్థానిక జగనన్న హౌసింగ్ కాలనీవాసులతో ఆయన ఆదివారం మమేకమైయారు. రాత్రి వేళల్లో ఇళ్లకు వచ్చేటప్పుడు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్.ఐ గస్తీ ఏర్పటు చేస్తామని భరోసా ఇచ్చారు.
కోనసీమ: ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని కొండాలమ్మ చింత వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అంబులెన్స్ ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడటంతో పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడుని వేరే అంబులెన్స్‌లో కాకినాడ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
VSP: చలికాలంలో మంచు దుప్పటి కప్పుకుని తన అందాలతో పర్యాటకులను ఆకర్షించే అరకులోయ ఉత్సవాలు ఘనంగా ముగిసాయి. ఈ సందర్భంగా మూడు రోజుల వరకు చలి పండుగ పేరుతో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజి గ్రౌండ్‌లో వేడుకలు నిర్వహించారు. ప్యారా గ్లెడింగ్, హాట్ ఎయిర్ బెలూన్, ధింసా డాన్స్ సహా మరికొన్ని కార్యక్రమాలు చేపట్టారు.
VSP: వన్ టౌన్ ప్రాంతంలోని 37వ వార్డులోని జంబల్ తోట ప్రాంతంలో గల వరసిద్ధి వినాయక ఆలయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం ఆలయ వార్షికోత్సవ నేపథ్యంలో ఎమ్మెల్యే తొలి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందజేశారు.
ప్రకాశం: కనిగిరి డివిజన్ పరిధిలోని 13 మండలాల రైతులు, ప్రజలు కనిగిరి పట్టణంలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం జరుగు మీ కోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో కేశ్వర్ధన్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి సోమవారం జరిగే మీకోసం కార్యక్రమం ఆర్డీవో కార్యాలయంలో అర్జీలను స్వీకరిస్తున్నట్లు ఆయన అన్నారు.
KRNL: ఆలూరులో నిన్న ఓ బస్సు అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. డ్రైవరు గుండెపోటుకు గురికావడమే ఈ ఘటనకు కారణంగా తెలిసింది. ట్రావెల్స్ బస్సు ఆదోని నుంచి బళ్లారికి వెళ్తుంది. పట్టణంలోని సాయిబాబా ఆలయం సమీపంలోకి రాగానే డ్రైవర్ ఉసేన్ (64)కు గుండెపోటు వచ్చింది. బస్సు స్టీరింగ్ అదుపు తప్పడం ఒక్కసారిగా రోడ్డు పక్కనున్న డివైడర్‌ను ఢీకొంది.
PLD: వినుకొండ పట్టణంలో ఓ యువకుడు పసిపాపకు చాక్లెట్ ఇచ్చి ఎత్తుకు వెళ్ళబోయాడు. పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్ ఇసుక వాగు వద్ద ఆదివారం చిన్న పాపను గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకొని పోగా స్థానికులు గమనించి దేవశుద్ధి చేసి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అతడిది సంతమాగులూరు మండలం, కొమ్మాలపాడు గ్రామం అని సమాచారం. ఆ యువకుడికి మతిస్థిమితం లేదని తెలుస్తోంది.
KRNL: జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని హెచ్ కైరవాడి గ్రామంలో ఆదివారం సాయంత్రం 4 గడ్డి వాములు దగ్ధమయ్యాయి. స్థానికులు కడవల సహాయంతో మంటలను ఆర్పి, పక్కనే ఉన్న గడ్డి వాములకు మంటలు వ్యాప్తి చెందకుండా కాపాడారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. రైతులు శ్రీనివాసులు, భీమరాయుడు మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదంలో గడ్డి ఖాళీ బూడిదగా మారిందన్నారు.
KRNL: ఇసుక ఉచితంగా పొందాల్సిన వారు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని గోనెగండ్ల సీఐ గంగాధర్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని వాహన తనిఖీ నిర్వహించి కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. బహిరంగంగా మద్యం సేవించటం చట్టరీత్యా నేరమన్నారు.
E.G: రాజమహేంద్రవరం స్థానిక నాగరాజా ప్రాథమిక పాఠశాల HM మోటూరి మంగారాణి, మేడిది సుబ్బయ్య ట్రస్ట్ స్వచ్చంద సేవా సంస్థ వారిచే ‘విశిష్ట సేవా రత్న” పురస్కారం అందుకున్నారు. ట్రస్ట్ అధినేత మేడిది వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. తమ ట్రస్ట్ ద్వారా నేడు విద్య, సాంస్కృతిక, కళారంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారికి పురస్కారం అందిస్తున్నామన్నారు.