TG: తనను అణగదొక్కాలని చూశారని మాజీమంత్రి జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘అవమానాలు, అన్యాయాలపై ఎందుకు ఓపిక పట్టాలి. నేను మంత్రి పదవికి అర్హుడిని కాదా?. కాంగ్రెస్‌లో ఇంకెవరూ ఎదగకూడాదా?. వేంనరేందర్ రెడ్డికి రాజ్యసభ ఎలా ఇస్తారు. ఎంతమందిని ఇలా తొక్కుకుంటూ పోతారు. గతంలో చంద్రబాబు, KCRపై పోరాటం చేశా. ఇప్పటి నుంచి రేవంత్‌పై పోరాటం చేస్తా’ అని వెల్లడించారు.
ELR: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. బుధవారం కామవరపుకోట మండలం రావికంపాడు గ్రామంలో హెల్త్ క్లినిక్ సెంటర్ ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామస్తులకు ప్రసూతి, శిశు ఆరోగ్యం, నాన్ కమ్యూనికేబుల్ వ్యాధుల స్క్రీనింగ్, అవసరమైన మందులు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు.
జపాన్‌లోని టోకారా దీవుల్లో ‘టోకారా లీఫ్ వార్‌బ్లర్’ అనే కొత్త పక్షి జాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. 1982 తర్వాత ఆ దేశంలో కనుగొన్న తొలి, కొత్త పక్షి జాతి ఇదే కావడం విశేషం. 10-12CM పొడవు, 16-18CM రెక్కల వెడల్పుతో కేవలం 9 గ్రాముల బరువు ఉండే ఈ చిన్ని పక్షి.. చూడటానికి ‘ఇజిమాస్ వార్‌బ్లర్’ను పోలి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
CTR: నూతన పార్లమెంటు భవనంలో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఎంపీలు పలువురు పాల్గొన్నారు. వారు నూతన కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వైసీపీ ఎంపీల విజ్ఞప్తితో స్పీకర్ 12వ గదిని పార్టీకి కేటాయించిన సంగతి తెలిసిందే.
అనంతపురం నగరంలో ఆర్డీటీ సంస్థ రెన్యువల్ అయిన సందర్భంగా బుధవారం టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు పూల నాగరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి ఆర్డీటీ వ్యవస్థాపకుడు మంచు ఫెర్రర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆర్డీటీకీ రెన్యువల్ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు.
RR: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఏ ఒక్క శాఖలో ఒక్క ఫైల్ పెండింగ్‌లో ఉండకూడదన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనులు పూర్తి చేయాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
GDWL: జోగులాంబ గద్వాల పట్టణంలో ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించనున్న హనుమాన్ శోభయాత్రలో పాల్గొనవలసిందిగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాసు హనుమంతును బజరంగ్ దళ్ నేతలు బుధవారం ఆహ్వానించారు. శోభాయాత్ర నిర్వహణ కోసం తన వంతుగా కొంత ఆర్థిక విరాళాన్ని అందజేసినట్లు బజరంగ్ దళ్ నేతలు తెలిపారు.
MDCL: జిల్లా కోర్టు వద్ద మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, ప్రధాన న్యాయమూర్తి బాల భాస్కరరావు తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో సివిల్ కేసులు, కుటుంబ వివాదాలు, బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్, భూ వివాదాలకు సంబంధించిన కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
తిరుపతి నగరంలో కొన్నిచోట్ల గ్యాస్ సమస్య కొనసాగుతోంది. కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం కారణంగా కొన్ని హోటళ్లు మూతపడ్డాయి. కొందరు బ్లాక్ మార్కెట్‌లో డొమెస్టిక్ సిలిండర్లను కొనుగోలు చేసి హోటళ్లలో వినియోగిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపమే దీనికి కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
TG: రాష్ట్రంలో పెట్రోల్ బంక్‌ల దగ్గర భారీగా రద్దీ ఉంది. ఇంధన కొరత వదంతులతో వాహనదారులు బారులు తీరారు. బంకులు మూసేస్తున్నారని కొన్ని చోట్ల వదంతులు వ్యాపిస్తున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా ఫుల్‌ట్యాంక్ చేయించుకున్నారు. గంటల తరబడి బంక్‌ల దగ్గరే వాహనదారులు పడిగాపులు కాస్తున్నారు.
యాదాద్రి: సంస్థాన్ నారాయణపురం మండలం వావిళ్ళపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం స్వపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా వివిధ శాఖల అధికారులుగా, ప్రజాప్రతినిధులుగా వేషధారణలు వేసి అలరించారు. తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ పాలనాంశాలపై అవగాహన కల్పించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు యాజమాన్యం బహుమతులు అందజేశారు.
VKB: కోట్‌పల్లి మండలంలోని పంచాయతీల వార్డు సభ్యులకు బుధవారం నుంచి ఈనెల 31 తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సురేందర్ రెడ్డి తెలిపారు. బుగ్గాపూర్‌లోని డీఆర్ ఫంక్షన్ హాల్లో ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ శిక్షణ తరగతులు ఉంటాయని ఎంపీడీవో సురేందర్ రెడ్డి పేర్కొన్నారు.
మరో 3 రోజుల్లో IPL 2026 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇవాళ 10 జట్ల కెప్టెన్ల సమావేశం కానున్నారు. BCCI మ్యాచ్ రిఫరీలు శ్రీనాథ్, నితిన్ మీనన్, అంపైర్ ప్యానెల్ సభ్యుల ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ సందర్భంగా ఇన్నింగ్స్ టైమర్(60 సెకన్లు), ఇంపాక్ట్ ప్లేయర్ రూల్, కంకషన్ సబ్‌స్టిట్యూట్, ఒకే ఓవర్‌లో 2 బౌన్సర్లు వంటి అంశాలపై కెప్టెన్లు చర్చించనున్నారు.
NTR: కామ్రేడ్ గుంటూరు బాపనయ్య 49వ వర్ధంతిని విస్సన్నపేటలో బుధవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు, కెవీపీఎస్ జిల్లా నాయకుడు జ్ఞాన రత్నం నివాళులర్పించారు. గుంటూరు బాపనయ్య కృష్ణాజిల్లా దివిసీమ ప్రాంతంలో కష్టజీవుల కోసం విద్యార్థి దశ నుంచి అనేక పోరాటాలు చేశారు. దున్నే వాడికే భూమి కావాలని జమీందారులను ఎదిరించారన్నారు.
ADB: జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం సంబంధిత శాఖల అధికారులు, పెట్రోల్ బంక్ డీలర్లతో నిర్వహించిన జూమ్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రజలకు ఇంధన కొరత తలెత్తకుండా నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తూ సరఫరా నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.