• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సెల్‌ టవర్ వద్దంటూ గ్రామస్తుల ఆందోళన

BDK: బూర్గంపాడు మండల పరిధిలోని నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న సెల్‌ టవర్ వద్దని గ్రామస్తులు ఇవాళ ఆందోళనకు దిగారు. అంగన్వాడి సెంటర్‌కు ఆనుకోని గ్రామం మధ్యలో సెల్‌టవర్ నిర్మాణం చేయవద్దంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సెల్‌ టవర్ వల్ల పక్షులకు, తమకు ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

March 23, 2026 / 11:30 AM IST

8వ రోజుకు చేరుకున్న ఆదివాసుల దీక్ష

BDK: పాల్వంచలోని కలెక్టర్ కార్యాలయం వద్ద భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అశ్వరావుపేట మండలం రామన్నగూడెం గిరిజనులు చేపట్టిన ఆదివాసి ఆత్మగౌరవ నిరవధిక దీక్షలు సోమవారం నాటికి 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రామన్నగూడెం సర్పంచ్ మడకం నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఎనిమిది రోజులుగా దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు.

March 23, 2026 / 11:30 AM IST

‘బాహుబలి’, ‘RRR’ రికార్డులు బ్రేక్ చేసిన ‘ధురంధర్ 2’!

రణవీర్, ఆదిత్య ధర్ కాంబోలో వచ్చిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన 4 రోజుల్లోనే రూ.750 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డులు తిరగరాసినట్లు తెలుస్తోంది. దీంతో ‘బాహుబలి 2′(రూ.591CR), ‘RRR'(రూ.470CR), ‘కల్కి'(రూ.500CR) వంటి భారీ సినిమాల రికార్డులను అధిగమించి, భారతీయ సినీచరిత్రలో అత్యధిక ఓపెనింగ్ వీకెండ్ సాధించిన రెండో మూవీ...

March 23, 2026 / 11:28 AM IST

బాహుబలి, RRR రికార్డులకు ధురంధర్-2 బ్రేక్!

రణ్‌వీర్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. రిలీజైన 4 రోజుల్లోనే రూ.750 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డులు తిరగరాసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీంతో బాహుబలి-2(₹591Cr), RRR(₹470Cr), కల్కి(₹500Cr) తదితర భారీ సినిమాల రికార్డులను అధిగమించి, భారతీయ సినీచరిత్రలో అత్యధిక ఓపెనింగ్ వీకెండ్ సాధించిన రెండో మూవీగా నిలిచింది.

March 23, 2026 / 11:28 AM IST

విదేశీ AIల కోసం రష్యా కొత్త రూల్స్!

యూజర్ల డేటా భద్రత దృష్ట్యా ChatGPT, జెమిని వంటి విదేశీ AIలను రష్యా నిషేధించే అవకాశం ఉందని పలు నివేదికలు పేర్కొన్నాయి. కొత్త నిబంధనల ప్రకారం.. 5 లక్షల కంటే ఎక్కువ మంది యూజర్లు ఉన్న ప్లాట్‌ఫామ్‌లు డేటాను మూడేళ్ల పాటు రష్యాలోనే నిల్వ చేయాల్సి ఉంటుంది. డేటా విదేశాలకు వెళ్లకుండా అడ్డుకునేందుకు ఈ కఠినమైన చర్యలు తీసుకోవాలని తాజాగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

March 23, 2026 / 11:27 AM IST

బోరిగాంలో అగ్రిప్రమాదం.. స్పందించిన ప్రభుత్వం

ADB: నేరడిగొండలో ఫైర్ స్టేషన్ కోసం ఏడాది నుంచి ఎదురుచూపులు సాగుతుండగా, తాజాగా బోరిగాం గ్రామంలో 5 ఇళ్లు దగ్ధం కావడం అధికారులను కదిలించింది. ఇటీవల అసెంబ్లీ సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రస్తావించగా.. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫైర్ స్టేషన్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.

March 23, 2026 / 11:27 AM IST

దిలార్పూర్‌లో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం

NRML: దిలార్పూర్ మండల కేంద్రంలో సోమవారం ఎమ్మార్వో కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎజాజ్ హమీద్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలలో నెలకొన్న వివిధ సమస్యలపై ప్రతి శాఖ అధికారి బాధ్యతతో పనిచేసి పరిష్కారం దిశగా కృషి చేయాలని సూచించారు.

March 23, 2026 / 11:26 AM IST

బకాయిలు వారసత్వంగా వచ్చేవే: భట్టి

TG: ఉద్యోగులకు ప్రభుత్వ బకాయిలు అనేవి వారసత్వంగా వచ్చేవేనని మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులకు మానవీయ కోణం ఉందని.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ భారం నుంచి తప్పించుకోవడానికి గత ప్రభుత్వం పదవీ విరమణ వయసును మూడేళ్లకు పెంచిందని.. ఆ భారమంతా ఇప్పుడు తమ ప్రభుత్వంపై పడిందన్నారు.

March 23, 2026 / 11:25 AM IST

మచిలీపట్నం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు

AP: మచిలీపట్నంలోని జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. కోర్టులో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తులు జిల్లా జడ్జికి ఈ-మెయిల్ పంపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టులోకి ఎవరినీ అనుమతించలేదు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో కోర్టు పరిసరాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు.

March 23, 2026 / 11:24 AM IST

కల్వకుర్తి బస్టాండ్‌లో శ్రమదానం

NGKL: కల్వకుర్తి పట్టణానికి చెందిన స్వామి వివేకానంద సేవ బృందం, మై భారత ఆధ్వర్యంలో షాహిద్ దివాస్ సందర్భంగా సోమవారం ఉదయం పట్టణంలోని బస్టాండ్ ఆవరణంలో శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణంలో ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు, చెత్తను స్వచ్ఛందంగా తొలగించారు. అనంతరం దేశభక్తిని చాటుతూ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.

March 23, 2026 / 11:24 AM IST

జ్యోతి ఉత్సవాల్లో పాల్గొన్న బీసీ ఇందిరమ్మ..!

NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో ఇవాళ జ్యోతి ఉత్సవాలను భక్తులు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా బీసీ ఇందిరమ్మ చౌడేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలను ఇచ్చారు.

March 23, 2026 / 11:23 AM IST

ఘనంగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు

VZM: ప్రముఖ సామాజిక సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలను సోమవారం కలెక్టరేట్లో ఘనంగా జరిగాయి. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్.సత్తిబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా దొమ్మేటి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

March 23, 2026 / 11:23 AM IST

రైతులకు అలర్ట్.. మిగిలినవి రెండు రోజులే..!

MBNR: కొత్తగా పట్టాదారు పాస్‌బుక్ పొందిన రైతులు మార్చి 25 లోపు ‘రైతు భరోసా’కు దరఖాస్తు చేసుకోవాలని గాండీడ్ మండలం పెద్దవార్వాల్ ఏఈఓ శివలీల తెలిపారు. ఫిబ్రవరి 28 వరకు పాస్‌బుక్ పొంది, వివరాలు నమోదు చేయని వారు ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, మొబైల్ నంబర్ వివరాలను ఏఈఓకు సమర్పించాలని ఆమె సూచించారు.

March 23, 2026 / 11:23 AM IST

చిన్నశేష వాహనంపై కోదండ రాముడు

కడప: నగరంలోని హౌసింగ్ బోర్డ్ శ్రీకోదండ రామాలయంలో వైభవంగా రాములవారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఉదయం నుంచి శ్రీ సీతారామచంద్రుల వారికి నిత్య కైంకర్యాలను విశేషంగా నిర్వహించారు. అనంతరం ఆలయ మాడ వీధుల్లో చిన్న శేష వాహనంపై అలంకరించి ఊరేగించారు. స్వామి వారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

March 23, 2026 / 11:23 AM IST

ముత్యాల నాయుడుకు ఘన స్వాగతం పలికిన జిల్లా నేతలు

SKLM: మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు పార్టీ పరిశీలన హోదాలో జిల్లాకు తొలిసారి విచ్చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాలపై సమీక్షించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు నేతలు వెల్లడించారు.

March 23, 2026 / 11:20 AM IST