KDP: మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనపై మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ స్పందిస్తూ, ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేశారు. హార్ట్ సమస్యల కారణంగా అలాంటి పరిస్థితి లేదని పేర్కొన్నారు. పరీక్షల విధానంపై అనుమానాలు ఉన్నాయని, విచారణ పూర్తయ్యాక అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
కడప: జిల్లాలో రబీలో వాతావరణం అనుకూలించడంతో 88,114 హెక్టార్లలో శెనగ పంట సాగు జరిగింది. ఎప్పుడూ లేని విధంగా హెక్టారుకు 25 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. పంట చేతికొచ్చాక మార్కెట్లో రేటు పడిపోయింది. దింతో ప్రభుత్వం రూ. 5,875 MSP ప్రకటించింది. జిల్లాలో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేపట్టింది. ఇప్పటి వరకు కేవలం 13,460MTలు మాత్రమే కొనుగోలు చేశారు.
కర్నూలు: జిల్లాలోని క్రిష్ణగిరి మండలం ఎరుకలచెరువు సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం బండరాళ్లతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడి ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు గొల్లకుంట్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. మరిన్ని పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
SDPT: కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామంలో ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ర్యాలీ, మానవహారం ద్వారా నీటి సంరక్షణపై నినాదాలు చేశారు. నీటిని పొదుపుగా వినియోగించాలని సర్పంచ్ బోయిని సంపత్ సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
KMM: సత్తుపల్లి స్థానిక 13వ వార్డులో కొనసాగుతున్న డ్రైనేజీ క్లీనింగ్ పనులను కాంగ్రెస్ నాయకులు కమల్ పాషా, వార్డు కౌన్సిలర్ నాగమణి హనుమంతు, మున్సిపల్ కమిషనర్ నరసింహా సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డ్రైనేజీలలో పేరుకుపోయిన పూడికను తొలగించే ప్రక్రియను నాయకులు దగ్గరుండి పర్యవేక్షించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
CTR: కాణిపాకం టోల్‌గేట్ టెండర్ల ప్రక్రియ నేడు నిర్వహించనున్నారు. మొత్తం 34 మంది టెండర్ దారులు దరఖాస్తు చేసుకోవడంతో ఈసారి బహిరంగ వేలానికి గట్టి పోటీ నెలకొంది. టోల్‌గేట్‌ను దక్కించుకునేందుకు కొంతమంది బడా నేతలు సిండికేట్‌గా ఏర్పడి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో టెండర్ల ప్రక్రియ ఉత్కంఠభరితంగా మారింది.
మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని సుతారిపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్రామంలో భాగంగా చేపట్టిన కందకాల తవ్వకం పనులను గ్రామ సర్పంచ్ సునీల్, టెక్నికల్ అసిస్టెంట్ (T.A) స్వాతి సోమవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో మౌలిక వసతుల కల్పనే ప్రధాన లక్ష్యంగా పనులను వేగవంతం చేస్తున్నట్లు
TG: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించిన BRS నేత హరీష్.. దీనిపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్‌కు కాకుండా ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడానికి గల కారణమేంటని ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘ఎగుమతులపై టెండర్స్ పిలిచారా? కాకినాడ పోర్టులోని 7,500 మెట్రిక్ టన్నుల బియ్యం ఏమయ్యాయి?’ అని ప్రశ్నించారు.
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం సిద్ధనపాలెం మండల పరిషత్ పాఠశాలలో నాగుపాము కలకలం రేపింది. ఉదయం తరగతుల గదుల వద్ద ప్రత్యక్షమైంది. టీచర్లు గుర్తించి స్నేక్ రెస్క్యూవర్ మల్లికార్జునకు సమాచారం అందించారు. అతను చాకచక్యంగా పామును బంధించి అడవిలో విడిచిపెట్టారు.
PPM: జిల్లాలో ఉపాధిహామీ, పంచాయతీరాజ్ శాఖల ద్వారా జరుగుతున్న డోలి రోడ్లు, అభివృద్ధి పనులకు సంబంధించి ఈ నెల 25వ తేదీ సాయంత్రం నాటికి తప్పనిసరిగా బిల్లులు పూర్తి కావాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఇంజనీరింగ్ అధికారులతో ఎం.బుక్ నమోదు బిల్లులు చెల్లింపులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
KMM: రాజీ మార్గమే రాజమార్గమని వైరా ఎస్సై పి. రామారావు తెలిపారు. ఈ నెల 28న నిర్వహించే మెగా లోక్ అదాలత్‌లో రాజీ పడదగ్గ కేసులను ఇరువర్గాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. కోర్టు కేసుల నుంచి విముక్తి పొందేందుకు బాధితులు, ముద్దాయిలు ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
PDPL: తెలంగాణ ప్రభుత్వ విప్‌గా నియామకమైన అనంతరం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో మర్యాదపూర్వకంగా కలిశారు. తన నియామకానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. స్పీకర్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో విప్ వేముల వీరేశం పాల్గొన్నారు.
AKP: రావికమతం మండలం టి.అర్జాపురం పంచాయతీ పి.కొట్నాబిల్లి గ్రామంలో జీడీ రైతులు ఇవాళ ప్లకార్డులతో నిరసన చేపట్టారు. అకాల వర్షాలు, మంచు తెగులు వల్ల నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని, కేజీకి రూ.200 మద్దతు ధర ప్రకటించాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టం అంచనా వేయాలని కోరారు.
PLD: వినుకొండ నియోజకవర్గం మదమంచిపాడు వీరాంజనేయ స్వామి తిరునాళ్ల ఎడ్ల పందేల నిర్వహణలో విభేదాలు భగ్గుమన్నాయి. కమిటీ సమావేశంలో సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు రాకపోవడంతో వైసీపీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ అభిప్రాయాలను బేఖాతరు చేస్తున్నారని ఆరోపిస్తూ, రాబోయే ఎడ్ల పందేల కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో గ్రామంలో రాజకీయ వేడి రాజుకుంది.
BDK: బూర్గంపాడు మండల పరిధిలోని నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న సెల్ టవర్ వద్దని గ్రామస్తులు ఇవాళ ఆందోళనకు దిగారు. అంగన్వాడి సెంటర్‌కు ఆనుకోని గ్రామం మధ్యలో సెల్‌టవర్ నిర్మాణం చేయవద్దంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సెల్ టవర్ వల్ల పక్షులకు, తమకు ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.