ASR: మంచినీటి సమస్య పరిష్కారం చేయకపోతే ఆందోళన ఉద్రిక్త చేస్తామని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి.సూర్యనారాయణ డిమాండ్ చేశారు. సరియ వలస గ్రామంలో మంచినీటి సౌకర్యం కల్పించాలని ఆ గ్రామ గిరిజనులతో సోమవారం ఆందోళన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2024లో నిర్మించిన బోరు అసంపూర్తిగా వదిలేసారని, దీంతో మంచినీరు సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ప్రకాశం: చీరాల గడియారస్థంభం సెంటర్‌లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రివర్యులు నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహ ఏర్పాటుకు సోమవారం మాజీమంత్రి పాలేటి రామారావు, మున్సిపల్ ఇంఛార్జ్ ఛైర్మన్ బోనిగల జైసన్ బాబుల ఆధ్వర్యంలో విగ్రహానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ.. కౌన్సిల్ సమావేశం ఆమోదంతో శంకుస్థాపన చేయటం జరిగిందన్నారు.
జనగామ: జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంపై అవగాహన పోస్టర్లను అదనపు కలెక్టర్, సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ మల్లికార్జున రావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఈఓ రమేష్, డీడబ్ల్యూవో ఫ్లోరెన్స్, డీపీఓ స్వరూప, తదితరులు పాల్గొన్నారు.
JGL: జిల్లాలో విధులు నిర్వర్తించి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మృతిచెందిన ఎస్ఐ రాజమౌళి కుటుంబానికి ఎస్పీ అశోక్ కుమార్ చేతుల మీదుగా రూ.4 లక్షలు ఆర్థికసాయం సోమవారం అందించారు. 2012 బ్యాచ్‌కు చెందిన ఏపీ, టీజీ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఎస్ఐలు కలిసి తోటి మిత్రుడు రాజమౌళి కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. వారందరూ కలిసి రూ.4 లక్షలు పోగుచేసి అందించారు.
KDP: కడప ప్రధాన కూడలిలో హిందూ, ముస్లిం మత నమూనాలు ఏర్పాటు చేసి, క్రైస్తవ నమూనా మరిచారని ఆ మతానికి చెందిన సభ్యులు ఎం. ప్రసాద్, సిహెచ్ విజయ్ బాబు అన్నారు. సోమవారం కడప కమిషనర్‌కు గ్రీవెన్స్‌లో అర్జీ ద్వారా విజ్ఞప్తి చేశారు. అన్ని మతాలను సమానంగా చూడాలని కోరారు. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
CTR: రామకుప్పంలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ పునర్నిర్మాణానికి దేవాదాయ శాఖ రూ.3.49 కోట్లు మంజూరు చేసినట్లు మండల టీడీపీ అధ్యక్షుడు ఆనందరెడ్డి స్పష్టం చేశారు. ఆలయంతో పాటుగా అభిషేక మండపం నిర్మాణం జరగనుందని ఆయన పేర్కొన్నారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన సుబ్రమణ్య స్వామి ఆలయ అభివృద్ధి చేస్తుండటంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
TPT: TTD ఈవో జే. శ్యామల రావు సోమవారం అన్నదాన సత్రంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అన్నం రుచిగా ఉందా అంటూ భక్తులను అడిగి తెలుసుకున్నారు. అన్నదాన సత్రంలో స్వయంగా భోజనం చేసి రుచి చూశారు. నాణ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
PDPL: రెండు రోజుల విరామం తర్వాత జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ ప్రారంభం కాగా.. క్వింటా పత్తి ధర రూ.7,170 పలికింది. సోమవారం మార్కెట్ రైతులు 13 వాహనాల్లో 77 క్వింటాల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా.. గరిష్ఠంగా రూ.7,170, కనిష్ఠంగా రూ.6,900 పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు. గత వారం కంటే తాజాగా పత్తి ధర రూ.20 పెరిగింది.
CTR: చిత్తూరు నగరపాలక కార్యాలయంలో సోమవారం నిర్వహించిన దుల ప్రజా ఫిర్యాపరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 5 ఫిర్యాదులు వచ్చినట్లు చిత్తూరు కమిషనర్ నరసింహ ప్రసాద్ తెలిపారు. ఈ ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
KDP: లంకమల అభయారణ్యంలో 7వ శతాబ్దపు నాటి శిల్ప రేఖలు తాజాగా బయటపడ్డాయి. సిద్ధవటం రేంజ్‌లోని చాకిరేవు ప్రాంతంలో పురాతన శిల్ప రేఖలు బయటపడ్డాయి. నాటి సైవులు పూజించే 2,3,1 పాదాలు కలిగి శివుని పాదరేఖా చిత్రాలు సైవులు శత్రువుల కోసం వినియోగించే త్రిశూలం,(ఉత్పత్తి పిడుగు )ఆయుధం శిల్ప రేఖ చిత్రాలు కనిపించాయి.
AP: రాష్ట్ర ప్రభుత్వానికి సినీనటుడు సోనూసూద్ నాలుగు అంబులెన్సులు ఇచ్చారు. వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి అందజేశారు. ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ తరఫున ఇచ్చిన అంబులెన్సులను చంద్రబాబు ప్రారంభించి ఆయనను అభినందించారు. కరోనా సమయం నుంచి అవసరం ఉన్నవారికి సాయం చేస్తూ సోనూసూద్ గొప్ప మనసు చాటుకుంటున్నారని పేర్కొన్నారు.
KMM: జిల్లాలో ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ.పద్మజ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఇంటర్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. పరీక్షలు ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 36,660 మంది విద్యార్థుల కోసం 72 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేస్తామన్నారు.
SKLM: రథసప్తమి వేడుకలకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం అరసవిల్లిలో పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రథసప్తమి సందర్భంగా నేటి రాత్రి నుంచి శ్రీ అరసవిల్లిలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.
VZM: చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకట్రావు సోదరుడు సత్యనారాయణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం ఆయన నివాసానికి వెళ్లి సత్యనారాయణ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యేతో మాట్లాడి మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.
లావణ్య-రాజ్ తరుణ్ కేసులో మస్తాన్ సాయి అరెస్టయ్యాడు. ఈ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ప్రేమ, పెళ్లి పేరుతో అమ్మాయిలకు వల వేసి బెడ్‌రూమ్స్‌లో కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డు చేశాడు. అతడి హార్డ్‌డిస్క్‌లో 300 మంది యువతుల వీడియోలు ఉన్నట్లు సమాచారం. యువతులను డ్రగ్స్‌కు బానిసలుగా చేసి బెదిరించి వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసినట్లు తెలుస్తోంది.