NLG: జిల్లా బీజేపీ అధ్యక్షులుగా నియమితులైన డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డికి బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవి గౌడ్ అభినందనలు తెలిపారు. నాగం వర్షిత్ రెడ్డిని రెండోసారి జిల్లా బీజేపీ అధ్యక్షులుగా నియమించిన జాతీయ పార్టీకి, రాష్ట్ర పార్టీకి నియామకానికి సహకరించిన పార్టీ పెద్దలకు రవి గౌడ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
NLG: మామను కోడలు హతమార్చిన ఘటన డిండి మండలం గోనబోయినపల్లిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ గొడవల నేపథ్యంలో మామ బద్దె రాములు (65)ను పెద్దకోడలు పెద్దులమ్మ కర్రతో కొట్టి రోడ్డుపై నెట్టి వేయగా రాములు తల వెనుక భాగంలో తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం: జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం పోస్టర్స్‌ను ఒంగోలులోని కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ అన్సారియా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 10న జరిగే జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో ఆల్బెండజోల్ మాత్రలు అంగన్వాడీలు, పాఠశాలలకు, కళాశాలకు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. కడుపులో నులి పురుగుల నివారణతో వ్యాధులు దూరమవుతాయన్నారు.
మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో మంగళవారం ఉదయం ఎస్పీ ఏఆర్ దామోదర్, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. రథ సప్తమి సందర్భంగా స్వామి నగరోత్సవంలో అమలు చేయాల్సిన బందోబస్తు ఏర్పాట్ల గురించి డీఎస్పీ నాగరాజుతో చర్చించారు. భక్తుల రాకపోకలకు అనుగుణంగా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని ఎస్పీ ఆదేశించారు.
NLR: అడిషనల్ DMHO ఎస్ కె. ఖాదర్ వలి, జిల్లా మలేరియా అధికారి హుసేనమ్మ నెల్లూరు జిల్లాలోని ల్యాబ్ టెక్నీషియన్లకు సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్దేశించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయక మలేరియా అధికారి వి. నాగార్జున రావు, WHO కన్సల్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్‌లు పాల్గొన్నారు.
BDK: ఇల్లందు మండలం రాజీవ్ నగర్ తండా సమీపంలోని క్వారీలో మంగళవారం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 24 ఏరియాకు చెందిన పల్లపు ఎల్లయ్య (40) మట్టి పెళ్ళలు పడి మరణించాడని స్థానికులు చెప్పారు. పెద్ద సైజు రాళ్లు కొడుతూ కాసేపు సేద తీరుతున్న సమయంలో మట్టి పెళ్లలు పడినట్లు తెలిపారు. గాయపడిన అతడిని తోటి కార్మికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడని అన్నారు.
KMM: 10వ తరగతి వరకు తమతో కలిసి చదువుకొని అనారోగ్యంతో బాధపడుతున్న స్నేహితులకు తోటి స్నేహితులు అండగా నిలిచారు. కామేపల్లి మండలం పండితాపురంకు చెందిన వీరయ్య, వెంకట్, ధనమ్మ కొమ్మినపల్లి హై స్కూల్ 1985- 86లో 10 తరగతి చదివారు. ముగ్గురు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు మంగళవారం తమ వంతు సహాయంగా రూ.38 వేలు అందజేశారు.
కృష్ణా: గన్నవరం మండలం చనుపల్లివారిగూడెంకు చెందిన కుచిపూడి సుబ్బయ్య అనే టీడీపీ కార్యకర్త రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. స్థానికుల కథనం మేరకు.. సోమవారం రామవరప్పాడు రింగ్ వద్ద బైక్‌పై వెళ్తూ లారీని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ATP: ఫీజు రియంబర్స్‌మెంట్ గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంగా తేజస్విని అన్నారు. సోమవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని విద్యార్థుల ఫీజులను పెండింగ్‌లో పెట్టి ఇప్పుడు ‘ఫీజు పోరు’ అనే కార్యక్రమంతో కపటనాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.
ADB: జిల్లాలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఈనెల 5న TSKC ఆధ్వర్యంలో TASK సౌజన్యంతో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సంగీత, TSKC కోఆర్డినేటర్ శ్రావణి పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో HETERO లాబొరేటరీస్‌లో ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్‌లో పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. బీఎస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఐటిఐ, పాసైన యువకులు మాత్రమే అర్హులన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో ఫిబ్రవరి 5న జరిగే పోలింగ్ పైనే ప్రధాన పార్టీలు బలమైన ఆశలు పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ తమ పార్టీ గెలిచే స్థానాలను అంచనా వేశారు. 70 అసెంబ్లీ స్థానాల్లో ‘ఆప్’ 55 స్థానాల వరకూ గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. మహిళలు తమ భర్తలను ఒప్పించినట్లయితే 60 సీట్లు గెలిచే అవకాశం ఉందన్నారు.
AP బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని సోనూసూద్ చెప్పారు. ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ కోసం రాష్ట్రానికి అంబులెన్సులు ఇచ్చినట్లు వెల్లడించారు. నాలుగు అంబులెన్సులు ఇవ్వడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. దీంతో మారుమూల గ్రామాల్లో అందిస్తున్న వైద్య సేవలకు బలం చేకూర్చినట్లు అయిందన్నారు. సోనూసూద్‌ను కలుసుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
ప్రకాశం: ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌కు 54 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో పోలీస్ అధికారులతో మాట్లాడారు. వారి సమస్యలను సావధానంగా విన్నారు. చట్ట పరిధిలో ఉన్న సమస్యలను సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి పరిష్కరించారు.
AP: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని ఈనెల 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమాన్ని YCP మార్చి 12కు వాయిదా వేసింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ప్రకటించింది. రాష్ట్రంలోని మెజార్టీ జిల్లాల్లో MLC ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరినా, ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదని పేర్కొంది.
ELR: ఏలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బడేటి చంటి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం అహంకారపూరితంగా ప్రజా గళాన్ని అణచివేసిందని మండిపడ్డారు. స్వేచ్ఛాయుత వాతావరణానికి గండికొట్టిందని విమర్శించారు.