గోంగూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిలో విటమిన్ C, A, B6, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి క్లోరోఫిల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంతోపాటు ఎముకలను ధృఢంగా ఉంచుతాయి. హైబీపీ, ఆయాసం, దగ్గు, కళ్ల సమస్యలను దూరం చేస్తాయి. ముఖ్యంగా గోంగూర తినడం వల్ల రక్త హీనత, మహిళలు పీరియడ్స్ సమయంలో వచ్చే పెయిన్ నుంచి ఉపశమనం పొందవచ్చు.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఆ పాత్రకు సంబంధించిన లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. దీంతో డార్లింగ్ లుక్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
AP: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవి TDP కైవసమైంది. మున్సిపల్ ఛైర్మన్‌గా TDP అభ్యర్థి రమేష్ కుమార్ ఎన్నికయ్యారు. రమేష్‌కు అనుకూలంగా 23 ఓట్లు రాగా YCP అభ్యర్థి లక్ష్మీకి 14 ఓట్లు వచ్చాయి. రమేష్‌ను MLA నందమూరి బాలకృష్ణ ఛైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ క్రమంలో కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ కౌన్సిలర్లు బహిష్కరించారు.
కడప: జిల్లాలోని ఏఆర్ పోలీస్ పెరేడ్ మైదానం నందు సోమవారం హోంగార్డ్స్ కమాండెంట్ మహేష్ కుమార్ హోంగార్డులతో దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో హోంగార్డుల సేవలు అభినందనీయమని, క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, హోంగార్డుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తానని అన్నారు.
HYD: రోడ్డు ప్రమాదంలో MLA గన్‌మెన్ మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం శంకర్‌పల్లి మండలం బుల్కాపూర్‌కు చెందిన శ్రీనివాస్(34) ఆదివారం బీరప్ప జాతరకెళ్లాడు. జాతర ముగించుకుని స్వగ్రామానికి బయల్దేరాడు. కొండకల్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాస్ చేవెళ్ల MLA కాలే యాదయ్య వద్ద గన్‌మెన్‌గా పని చేస్తున్నాడు.
సత్యసాయి: హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి రమేష్ ఎన్నికయ్యారు. రమేష్‌కు అనుకూలంగా 23 ఓట్లు, వైసీపీ అభ్యర్థి లక్ష్మీకి అనుకూలంగా 14 ఓట్లు పడ్డాయి. ఎన్నికల అధికారి రమేష్ గెలిచినట్లు ప్రకటించారు.
ELR: నూజివీడు మండలం తుక్కులూరు గ్రామ ఎన్ఆర్జిఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు నియామకం వివాదంలో పడింది. గతంలో పనిచేసిన వ్యక్తికి ఈ పోస్టు ఇచ్చేందుకు అధికార పార్టీ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఈ పోస్టు అతనికి ఇవ్వొద్దంటూ ఇటీవల కొందరు నూజివీడు సబ్ కలెక్టర్‌కు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.
VZM: గరివిడి శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం విద్యార్థులు సోమవారం నిరవధిక దీక్ష చేపట్టారు. స్టైఫండ్ వెంటనే ప్రభుత్వం మంజూరు చేయాలని దీక్షకు దిగారు. మెడికల్ విద్యార్థులకు ఇచ్చే సౌకర్యాలు పశువైద్య విద్యార్థులకు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు దీక్షలు కొనసాగిస్తామన్నారు.
CTR: మాజీ మంత్రి పుంగనూరు MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా బంగారు పేటలో జరిగిన బోయకొండ ఆలయ మాజీ డైరెక్టర్ రాజేష్ మేనకోడలి వివాహ వేడుకల్లో సోమవారం పెద్దిరెడ్డి పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట చిత్తూరు మాజీ MP రెడ్డప్ప, పలమనేరు మాజీ MLA వెంకటే గౌడ్ తదితరులు ఉన్నారు.
CTR: బంగారుపాలెం మండలం మొగిలి ఘాట్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో తమిళనాడుకు చెందిన కంటైనర్ డ్రైవర్ చిరంజీవి, గంగవరం మండలానికి చెందిన టిప్పర్ డ్రైవర్ శ్రీనివాసులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కడప: జిల్లా వ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. జిల్లాలోని కొండాపురం, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు తదితర ప్రాంతాల్లో సరస్వతి దేవి విగ్రహాలు, చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారులచే అక్షరాభ్యాస కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా అర్చకులు వసంత పంచమి పండుగ విశిష్టతను తెలిపారు.
HYD: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి సంపత్‌నగర్, ఊట్పల్లిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. సంపత్‌నగర్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమించి కబ్జా చేసిన కట్టడాలు, ఊట్పల్లిలో రోడ్డును ఆక్రమించి అడ్డంగా గేటు ఏర్పాటు చేయడంతో చర్యలు ప్రారంభించారు. నాలాలు, చెరువులను కబ్జా చేస్తే సహించేది లేదని అధికారులు హెచ్చరించారు.
ప్రకాశం: ఒంగోలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్నట్లు కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు చెప్పారు. మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జరగనున్న సాధారణ సమావేశంలో 29 అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద కేటాయించిన నిధులతో చేపట్టిన పనుల ఆమోదం, ముస్లిం షాదీఖానా స్థలం అంశాలపై చర్చ ఉంటుందన్నారు.
TG: వసంత పంచమి వేడుకల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విద్యాసంస్థలకు ఆప్షనల్ హాలిడే ప్రకటించింది. దీంతో పలు హిందుత్వ, ఆధ్యాత్మిక సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే స్కూళ్లకు నేడు సెలవు ఉండనుంది. అలాగే, సెలవు ఇవ్వాలా లేదా అనేది స్కూళ్ల యాజమాన్యాలు నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. మరోవైపు ఏపీలో ఎలాంటి హాలీడే ప్రకటించలేదు.
ASR: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం జరగాల్సిన మీ కోసం (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేసినట్లు పీవో కట్టా సింహాచలం తెలిపారు. అన్ని మండలాల్లో జరగాల్సిన గ్రీవెన్స్ కార్యక్రమాలు రద్దు చేశామన్నారు. ఐటీడీఏలో జరిగే డివిజన్ జై గ్రీవెన్స్ సైతం రద్దు చేశామన్నారు.