• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వెలుగులోకి 7వ శతాబ్దపు నాటి శిల్ప రేఖలు

KDP: లంకమల అభయారణ్యంలో 7వ శతాబ్దపు నాటి శిల్ప రేఖలు తాజాగా బయటపడ్డాయి. సిద్ధవటం రేంజ్‌లోని చాకిరేవు ప్రాంతంలో పురాతన శిల్ప రేఖలు బయటపడ్డాయి. నాటి సైవులు పూజించే 2,3,1 పాదాలు కలిగి శివుని పాదరేఖా చిత్రాలు సైవులు శత్రువుల కోసం వినియోగించే త్రిశూలం,(ఉత్పత్తి పిడుగు )ఆయుధం శిల్ప రేఖ చిత్రాలు కనిపించాయి.

February 3, 2025 / 05:31 PM IST

ఏపీకి ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ అంబులెన్సులు

AP: రాష్ట్ర ప్రభుత్వానికి సినీనటుడు సోనూసూద్ నాలుగు అంబులెన్సులు ఇచ్చారు. వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి అందజేశారు. ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ తరఫున ఇచ్చిన అంబులెన్సులను చంద్రబాబు ప్రారంభించి ఆయనను అభినందించారు. కరోనా సమయం నుంచి అవసరం ఉన్నవారికి సాయం చేస్తూ సోనూసూద్ గొప్ప మనసు చాటుకుంటున్నారని పేర్కొన్నారు.

February 3, 2025 / 05:28 PM IST

‘పకడ్బందీగా ఇంటర్ పరీక్షలను నిర్వహించాలి’

KMM: జిల్లాలో ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ.పద్మజ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఇంటర్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. పరీక్షలు ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 36,660 మంది విద్యార్థుల కోసం 72 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేస్తామన్నారు.

February 3, 2025 / 05:22 PM IST

‘భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు’

SKLM: రథసప్తమి వేడుకలకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం అరసవిల్లిలో పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రథసప్తమి సందర్భంగా నేటి రాత్రి నుంచి శ్రీ అరసవిల్లిలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.

February 3, 2025 / 05:18 PM IST

‘చీపురుపల్లి ఎమ్మెల్యేని పరామర్శంచిన మంత్రి’

VZM: చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకట్రావు సోదరుడు సత్యనారాయణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం ఆయన నివాసానికి వెళ్లి సత్యనారాయణ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యేతో మాట్లాడి మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.

February 3, 2025 / 05:17 PM IST

BREAKING: 300 మంది అశ్లీల వీడియోలు

లావణ్య-రాజ్ తరుణ్ కేసులో మస్తాన్ సాయి అరెస్టయ్యాడు. ఈ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ప్రేమ, పెళ్లి పేరుతో అమ్మాయిలకు వల వేసి బెడ్‌రూమ్స్‌లో కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డు చేశాడు. అతడి హార్డ్‌డిస్క్‌లో 300 మంది యువతుల వీడియోలు ఉన్నట్లు సమాచారం. యువతులను డ్రగ్స్‌కు బానిసలుగా చేసి బెదిరించి వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసినట్లు తెలుస్తోంది.

February 3, 2025 / 05:14 PM IST

ఘనంగా వసంత పంచమి వేడుకలు

JGL: కోరుట్ల అయ్యప్ప స్వామి దేవాలయంలో సోమవారం రోజున సరస్వతీమాత జన్మదినమైన వసంతపంచమిని పురస్కరించుకుని అర్చకులు గౌతం శర్మ, వినయ్ శర్మల నిర్వహణలో అమ్మ వారి మూలవిరాట్టుకు, ఉత్సవ మూర్తికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం150 మంది విద్యార్థులకు అక్షరాభ్యాసం చేసి పుస్తక పూజ, విజయ కంకణధారణ చేశారు. మచ్చ వాణీ వెంకటరమణ స్వామివారికి బంగారు కిరీటాన్ని అందించారు.

February 3, 2025 / 04:57 PM IST

మానవత్వం చాటుకున్న భద్రాచలం ఎమ్మెల్యే

BDK: ఛత్తీస్‌గఢ్ నుంచి చర్లకు వస్తున్న ఓ కుటుంబం సోమవారం రోడ్డు ప్రమాదానికి గురైంది. చర్ల సరిహద్దుల్లో టూ-వీలర్, టాటా మ్యాజిక్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళుతున్న భద్రాచలం ఎమ్మెల్యే క్షతగాత్రులను పరిశీలించి, తన సహాయకులతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యేను స్థానికులు ప్రశంసించారు.

February 3, 2025 / 04:50 PM IST

మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలి

VZM: నామినేటెడ్ పదవుల్లో మహిళలకు కూటమి ప్రభుత్వం 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వబ్బిన సన్యాసినాయుడు సోమవారం ఓ ప్రకటనలో కోరారు. మూడో విడతలో ప్రభుత్వం ఇవ్వనున్న నామినేటెడ్ పదవుల్లో మహిళలకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు లేఖ రాసినట్లు తెలిపారు.

February 3, 2025 / 04:49 PM IST

మార్చి 8న జాతీయ లోక్ అదాలత్

W.G: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార కార్యదర్శి రత్న ప్రసాద్ సోమవారం తెలిపారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..  8న 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరిగే లోక్ అదాలత్‌లో రాజీ యోగ్యమైన కేసులు పరిష్కరిస్తామన్నారు. అలాగే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

February 3, 2025 / 04:43 PM IST

శ్రీ పోలేరమ్మ తల్లి హుండీ లెక్కింపు కార్యక్రమం

NLR: అల్లూరు పట్టణంలోని శ్రీ పోలేరమ్మ తల్లి హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని దేవస్థాన అధికారులు సోమవారం చేపట్టారు. దాదాపుగా ఎనిమిది నెలలకు గాను రూ.4,69,840 వచ్చినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్, ఆలయ కార్య నిర్వహణ అధికారి, దేవస్థాన సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

February 3, 2025 / 04:03 PM IST

‘కూటమి పాలనలో దిగజారుతున్న తిరుపతి ప్రతిష్ట’

CTR: కూటమి పాలనలో తిరుపతి ప్రతిష్ట దిగజారుతున్నట్టు మాజీ మంత్రి రోజా ఆరోపించారు. డిప్యూటీ మేయర్ ఎన్నికలలో వైసీపీ నాయకులపై దాడికి పాల్పడటం, కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడం దారుణమన్నారు. పోలీసుల సమక్షంలోనే ఇలా జరగడం చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో? తెలుస్తోందన్నారు. డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.

February 3, 2025 / 03:50 PM IST

సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ పత్రాలు దగ్ధం

BDK: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులకు, రైతులకు ఏమాత్రం ఉపయోగం లేదని కేవలం కార్పొరేట్ వర్గాల వారికి మాత్రమే ఉపయోగపడుతుందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శరత్ బాబు అన్నారు. కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం భద్రాచలం అంబేద్కర్ సెంటర్‌లో బడ్జెట్ పత్రాలు దగ్ధం చేశారు.

February 3, 2025 / 03:43 PM IST

అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ డిగ్రీ ఫీజు గడువు పెంపు

PDPL: అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువును ఫిబ్రవరి 4 వరకు పొడిగించడంపై కళాశాల కో-ఆర్డినేటర్ అబ్దుల్ షుకూర్ వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం కళాశాలలోని వర్సిటీ అభ్యాసకుల సహాయ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.

February 3, 2025 / 03:43 PM IST

ఆజామ్ జాహీ మిల్లుపై మావోయిస్టు పార్టీ లేఖ

ములుగు: ఆజామ్ జాహీ మిల్లు వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ వెంకటేశ్ పేరుతో సోమవారం ములుగు జిల్లాలో లేఖ కలకలం సృష్టిస్తోంది. భూములపై పూర్తి హక్కు కార్మికులకు, వారి కుటుంబాలకు దక్కే వరకు పోరాటాలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు.

February 3, 2025 / 03:41 PM IST