ATP: వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా గుత్తి గేట్స్ కళాశాల ఆధ్వర్యంలో మంగళవారం కళాశాల విద్యార్థులు క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్యం, అలవాట్లు, ఆహారం పట్ల జాగ్రత్త తీసుకోండి – క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టండి అని నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. అనంతరం గాంధీ చౌక్ వద్ద మానవహారంగా ఏర్పడ్డారు.
SKLM: పాఠశాలలను విలీనం చేయొద్దని విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన తెలిపారు. ఈ మేరకు పాలకొండ ఎంఈఓ కార్యాలయం వద్ద గొట్టమంగళాపురం గ్రామానికి చెందిన విద్యార్థుల, తల్లిదండ్రులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాల విలీనం చేయడం ద్వారా విద్యార్థులు ఎంతో ఇబ్బందులకు గురవుతారని అన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ADB: తాంసి మండలం వడ్డడి మత్తడివాగు ప్రాజెక్టు వివరాలను మంగళవారం జెఈ హరీష్ వెల్లడించారు. ప్రాజెక్ట్ యొక్క పూర్తిస్థాయి నీటిమట్టం 277.50 మీటర్లు కాగా ప్రస్తుతం నీటిమట్టం 275.450 మీటర్లకు చేరుకుంది. నిల్వ సామర్థ్యం 0.336 టీఎంసీలు కాగా గడిచిన 24 గంటల్లో ఇన్ ఫ్లో లేదని, ఔట్ ఫ్లో 80 క్యూసెక్కులుగా వివరించారు. కాలువల ద్వారా సాగునీరు విడుదల చేస్తున్నామన్నారు.
NTR: నందిగామ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక 11గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు బాబు జగ్జీవన్ రామ్ హల్‌కు కౌన్సిలర్లు, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేరుకున్నారు. టీడీపీ నాయకులు కౌన్సిల్ సమావేశానికి భారీగా చేరుకోవటంతో ఎటువంటి గొడవలు జరగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. కౌన్సిల్ సమావేశానికి శాఖమూరి స్వర్ణలత, కామసాని సత్యవతి చేరుకోవాల్సి ఉంది.
నల్గొండ: కనగల్ ఉన్నత పాఠశాలలో పురాతన నాగేంద్రుని రాతి విగ్రహం బయటపడిందని స్థానికులు తెలిపారు. పాఠశాల్లో బాత్రూంల నిర్మాణం కోసం తవ్వకాలు నిర్వహిస్తుండగా ఈ విగ్రహం బయట పడిందన్నారు. ఈ విగ్రహం కాకతీయుల, రెడ్డి రాజుల పరిపాలనా కాలానికి చెందినదిగా చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. గతంలోనూ కనగల్ వాగులో ఓ విగ్రహం కనిపించిందని స్థానికులు పేర్కొన్నారు.
ప్రకాశం: దోర్నాలలోని ఇందిరానగర్ కాలనీలో ఓ ఇంట్లో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్‌గా పని చేస్తున్న పాల్తి రాజేశ్ ఇంట్లోకి చొరబడి బీరువాలోని రెండు బంగారు బ్రాస్ లైట్లు, 9 ఉంగరాలు దొంగలించారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీమ్‌ను రంగంలోకి దింపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NLG: జిల్లా బీజేపీ అధ్యక్షులుగా నియమితులైన డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డికి బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవి గౌడ్ అభినందనలు తెలిపారు. నాగం వర్షిత్ రెడ్డిని రెండోసారి జిల్లా బీజేపీ అధ్యక్షులుగా నియమించిన జాతీయ పార్టీకి, రాష్ట్ర పార్టీకి నియామకానికి సహకరించిన పార్టీ పెద్దలకు రవి గౌడ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
NLG: మామను కోడలు హతమార్చిన ఘటన డిండి మండలం గోనబోయినపల్లిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ గొడవల నేపథ్యంలో మామ బద్దె రాములు (65)ను పెద్దకోడలు పెద్దులమ్మ కర్రతో కొట్టి రోడ్డుపై నెట్టి వేయగా రాములు తల వెనుక భాగంలో తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం: జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం పోస్టర్స్‌ను ఒంగోలులోని కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ అన్సారియా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 10న జరిగే జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో ఆల్బెండజోల్ మాత్రలు అంగన్వాడీలు, పాఠశాలలకు, కళాశాలకు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. కడుపులో నులి పురుగుల నివారణతో వ్యాధులు దూరమవుతాయన్నారు.
మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో మంగళవారం ఉదయం ఎస్పీ ఏఆర్ దామోదర్, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. రథ సప్తమి సందర్భంగా స్వామి నగరోత్సవంలో అమలు చేయాల్సిన బందోబస్తు ఏర్పాట్ల గురించి డీఎస్పీ నాగరాజుతో చర్చించారు. భక్తుల రాకపోకలకు అనుగుణంగా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని ఎస్పీ ఆదేశించారు.
NLR: అడిషనల్ DMHO ఎస్ కె. ఖాదర్ వలి, జిల్లా మలేరియా అధికారి హుసేనమ్మ నెల్లూరు జిల్లాలోని ల్యాబ్ టెక్నీషియన్లకు సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్దేశించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయక మలేరియా అధికారి వి. నాగార్జున రావు, WHO కన్సల్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్‌లు పాల్గొన్నారు.
BDK: ఇల్లందు మండలం రాజీవ్ నగర్ తండా సమీపంలోని క్వారీలో మంగళవారం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 24 ఏరియాకు చెందిన పల్లపు ఎల్లయ్య (40) మట్టి పెళ్ళలు పడి మరణించాడని స్థానికులు చెప్పారు. పెద్ద సైజు రాళ్లు కొడుతూ కాసేపు సేద తీరుతున్న సమయంలో మట్టి పెళ్లలు పడినట్లు తెలిపారు. గాయపడిన అతడిని తోటి కార్మికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడని అన్నారు.
KMM: 10వ తరగతి వరకు తమతో కలిసి చదువుకొని అనారోగ్యంతో బాధపడుతున్న స్నేహితులకు తోటి స్నేహితులు అండగా నిలిచారు. కామేపల్లి మండలం పండితాపురంకు చెందిన వీరయ్య, వెంకట్, ధనమ్మ కొమ్మినపల్లి హై స్కూల్ 1985- 86లో 10 తరగతి చదివారు. ముగ్గురు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు మంగళవారం తమ వంతు సహాయంగా రూ.38 వేలు అందజేశారు.
కృష్ణా: గన్నవరం మండలం చనుపల్లివారిగూడెంకు చెందిన కుచిపూడి సుబ్బయ్య అనే టీడీపీ కార్యకర్త రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. స్థానికుల కథనం మేరకు.. సోమవారం రామవరప్పాడు రింగ్ వద్ద బైక్‌పై వెళ్తూ లారీని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ATP: ఫీజు రియంబర్స్‌మెంట్ గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంగా తేజస్విని అన్నారు. సోమవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని విద్యార్థుల ఫీజులను పెండింగ్‌లో పెట్టి ఇప్పుడు ‘ఫీజు పోరు’ అనే కార్యక్రమంతో కపటనాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.