• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కుందూ నదిలో ఈతకు వెళ్లి వ్యక్తి మృతి

KDP: కుందూ నది వంతెన కింద ఈతకు వెళ్లిన గొడుగు సురేశ్ అనే వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు మేరకు.. మృతుడు ఆళ్లగడ్డ టౌన్ పట్టణానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతను పెద్దముడియంలో ఎద్దుల బండలాగుడు పోటీలను వీక్షించడానికి శనివారం వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే నిన్న నీటిలో మునిగి కనిపించలేదని, తిరిగి ఆదివారం వెతకగా.. మృతదేహం కనపడిందని పేర్కొన్నారు.

March 23, 2026 / 06:34 AM IST

కెరమెరిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు

ASF: కెరమెరిలోని సాకడ ఎక్స్ రోడ్డు వద్ద ఎస్సై మధుకర్ ఆదివారం రాత్రి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ద్విచక్రవాహనాలను ఆపి వారికి బ్రీత్ ఎనలైజర్‌‌తో తనిఖీలు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపినా, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా, అనుమతి పత్రాలు లైసెన్స్ లేకపోయినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

March 23, 2026 / 06:33 AM IST

ఇసుక అక్రమ రవాణా.. ఇద్దరిపై కేసు నమోదు

GDWL: ఊట్కూర్ మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామ శివారులో వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. తనిఖీలలో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాణిక్యప్ప, కురుమూర్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేశ్ తెలిపారు.

March 23, 2026 / 06:33 AM IST

నేడు జేసీ గ్రీవెన్స్ సమావేశం

ASR: రంపచోడవరంలో నేడు గ్రీవెన్స్ జరుగుతుందని జేసీ స్మరణ్ రాజ్ ఆదివారం సాయంత్రం మీడియా ప్రకటనలో తెలిపారు. రంపచోడవరం ITDA కార్యాలయం సమీపంలో ఉన్న మీటింగ్ హల్‌లో ఉదయం 10.30లకు ప్రారంభం అవుతుందన్నారు. పోలవరం జిల్లా వాసులు గమనించాలన్నారు. సమస్యలు పరిష్కారం కానివారు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు.

March 23, 2026 / 06:32 AM IST

యుద్దం ఎఫెక్ట్.. భారీగా కార్బన్ డయాక్సైడ్ విడుదల

పశ్చిమాసియాలో యుద్ధంతో పర్యావరణంపై ఎఫెక్ట్ పడుతోంది. యుద్ధం మొదలైన రెండు వారాల్లో 50 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల అయింది. కొనసాగుతున్న యుద్ధంతో ఇంకా భారీ మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ వెలువడనుంది. కాగా యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఇప్పటికీ ఇరాన్, అమెరికా ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నాయి.

March 23, 2026 / 06:31 AM IST

ఈ నెల 25న ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ్య సమావేశం

PPM: బలిజిపేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 25న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో వాణిశ్రీ తెలిపారు. ఎంపీపీ నాగమణి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుందని, సభ్యులంతా హాజరుకావాలని ఆమె కోరారు. సమావేశపు అజెండా నోటీసులను మండలస్థాయి అధికారులకు, ప్రజాప్రతినిధులకు ముందస్తుగా తెలియజేసినట్లు వెల్లడించారు.

March 23, 2026 / 06:30 AM IST

స్టెరాయిడ్ ఇంజెక్షన్లు సీజ్.. ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్‌లోని చాదరాఘాట్‌లో చార్మినార్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. స్టెరాయిడ్స్ ముఠా గుట్టురట్టు చేసి,20 స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, 3 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో షేక్ సమీర్, వసీం ఖాన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా తెప్పించి విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు.

March 23, 2026 / 06:30 AM IST

ఫోన్ హ్యాక్ చేసి ఖాతా ఖాళీ చేసిన సైబర్ కేటుగాళ్లు

MBNR: బాలానగర్‌లో ఫోన్ హ్యాక్ చేసి సైబర్ నేరగాళ్లు రూ.50 వేలు కాజేసిన ఘటన చోటుచేసుకుంది. బాధితుడు రవి తెలిపిన వివరాలు.. ఫోన్ స్క్రీన్ గీతలు వచ్చి స్విచ్ ఆఫ్ అయింది. తిరిగి ఆన్ చేసి చూడగా ఖాతాలోని నగదు మాయమైంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. గుర్తుతెలియని లింకులు, యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

March 23, 2026 / 06:30 AM IST

పిచ్చి కుక్కల దాడిలో వృద్ధురాలికి తీవ్రగాయాలు

MNCL: తాండూర్ మండలం అచ్చులాపూర్‌కి చెందిన కొండపెల్లి బయమ్మ అనే వృద్ధురాలిపై ఆదివారం రాత్రి పిచ్చి కుక్కలు దాడి చేయగా ఆమె తీవ్రంగా గాయపడింది. గమనించిన కుటుంబసభ్యులు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని పేర్కొన్నారు.

March 23, 2026 / 06:30 AM IST

నేరడిగుంటలో ఆసుపత్రి నిర్మాణ పనుల పరిశీలన

SRD: ఆందోల్ మండలం నేరడిగుంట గ్రామంలో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులను జోగిపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ మక్త జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ రూ.2.50 కోట్లు మంజూరు చేశారని ఆయన తెలిపారు. నేరడిగుంటలో ప్రాథమిక కేంద్రం లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, మంత్రి చొరవతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కళ నేరవేరిందని పేర్కొన్నారు.

March 23, 2026 / 06:29 AM IST

అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం

AKP: అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తున్నట్లు సివిల్ సప్లై కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బోడపాటి శివదత్ అన్నారు. ఆదివారం పాయకరావుపేటలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం హయాంలో రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వస్తున్నట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయన్నారు.

March 23, 2026 / 06:28 AM IST

యాగంటి ఆలయంలో ప్రత్యేక పూజలు..!

NDL: బనగానపల్లె మండలం యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. తెల్లవారుజామునుండే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి అభిషేకాలు, కుంకుమార్చన పూజలను చేశారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.

March 23, 2026 / 06:28 AM IST

డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీనివాసరావు

ఏపీ ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల సెంట్రల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా సంసాని శ్రీనివాసరావు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాడేపల్లిలో జరిగిన ఈ ఎన్నిక ప్రక్రియలో ఏపీ ఐకాస అమరావతి నేతలు ఫణిపేర్రాజు, మల్లేశ్వరరావు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. ఐకాస ఛైర్మన్‌ వెంకటేశ్వర్లు, కిశోర్‌, వి.అర్లయ్య తదితరులు శ్రీనివాసరావును సత్కరించి అభినందనలు తెలిపారు.

March 23, 2026 / 06:26 AM IST

వాహనాల దొంగను పట్టుకున్న పోలీసులు

MDK: మెదక్ పట్టణంలో రాందాస్ చౌరస్తా వద్ద వాహనాలను దొంగతనం చేస్తున్న వల్లేపు గోపాల్‌‌ను పోలీసులు పట్టుకున్నారు. అతన్ని విచారించగా మెదక్ పట్టణం చర్చ్ కాంపౌండ్‌లో 2 దొంగతనాలు చేసినట్లు ఒప్పుకొన్నాడు. అనంతరం రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడుపై మెదక్, పెద్ద శంకరం పేట, కామారెడ్డి జిల్లాల్లో కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.

March 23, 2026 / 06:25 AM IST

నేడు రాములోరి గోత్రనామాలపై హైకోర్టులో విచారణ

BDK: రాములోరి గోత్రనామాలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. భద్రాచలం రామయ్య కళ్యాణం సందర్భంగా తెరపైకి రాములు వారి గోత్రనామాల వివాదం బయటికి వచ్చింది. గోత్రనామాల వివాదం 2022 నుంచి హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. కాగా, ఐదుగురు పండితులతో హైకోర్టు విచారణ కమిటీ ఏర్పాటు చేయగా, రిపోర్టును ఆ కమిటీ దేవాదాయ శాఖకు సమర్పించింది.

March 23, 2026 / 06:24 AM IST