హనుమకొండ: దామెర మండలంలోని పులుకుర్తి గ్రామంలో బాల మానసాదేవి ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నేడు భూమి పూజ నిర్వహించారు. గ్రామస్తులు ఐకమత్యంగా ఉంటూ మానస దేవి ఆలయాన్ని నిర్మిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారాయితోపాటు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
CTR: ప్రకృతి వ్యవసాయం ఆరోగ్యదాయకమని IB PRP భువనేశ్వరి తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం అవరణంలో రైతు సాధికార సంస్థ వారిచే ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించి, అమ్మకాలు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయంలో హానికర క్రిమిసంహారక మందులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో ఎరువులతో పండించిన పంటలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అన్నారు.
CTR: ఎస్ఆర్ పురం ఘటనలో మృతి చెందిన వెంకటేశ్ కుటుంబానికి ప్రభుత్వ విప్, జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ ప్రగాడ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన సేవలు అందించాలని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు సూచించారు. మృతి చెందిన వెంకటేశ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
CTR: పుంగనూరులో మంగళవారం జరిగే రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అర్చకులు శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం వేకువజామున శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనం ప్రారంభమవుతుందని చెప్పారు. వాహన సేవలలో భక్తులు పాల్గొనాలని కోరారు.
TPT: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో ఒక ఏడాదిపాటు గ్రాడ్యుయేట్/ డిప్లొమా అప్రెంటిస్ షిప్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. గ్రాడ్యు యేట్-19, డిప్లమా- 7 మొత్తం 27 ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. అర్హత, ఇతర వివరాలకు https://www.iittp.ac.in/ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 28గా వెల్లడించింది.
TG: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. తాజాగా ఈఏపీసెట్ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈనెల 22 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 2 నుంచి 5వ తేదీ వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే, ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్ష జరగనుంది.
‘గ్రామీ అవార్డ్స్ 2025’ వేడుకలో అమెరికన్ ర్యాప్ సింగర్ జంట రచ్చ చేసింది. ర్యాపర్ కాన్యే వెస్ట్ భార్య బియాంకా సెన్సోరి.. తాను వేసుకున్న నల్లటి కోటు విప్పేసి ట్రాన్స్‌పరెంట్ దుస్తులతో నగ్నంగా ఫొటోలకు ఫోజు ఇచ్చి వివాదంలో చిక్కుకున్నారు. వేడుకలో ఆమె ప్రవర్తించిన తీరును పలువురు తప్పు పడుతున్నారు. కాగా, కాన్యే గ్రామీ అవార్డ్స్‌లో రెండు విభాగాల్లో నామినేట్ అయ్యాడు.
BDK: వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామంలో నాటు సారా కాస్తున్నారనే సమాచారం మేరకు సోమవారం పోలీసులు నిర్వహించిన దాడుల్లో భాగంగా 2 వేల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసినట్లు ఎస్సై కే.తిరుపతిరావు తెలిపారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామన్నారు. ఎవరైనా నాటు సారా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
KMM: కేంద్రం ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక బడ్జెట్‌కు నిరసనగా సోమవారం ఎర్రుపాలెం మండలం వెంకటపురంలో సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పార్టీ గ్రామశాఖ కార్యదర్శి కుడెల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. దేశంలో 50 శాతానికి పైబడి వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తుండగా ఆ రంగంపైనా ఉదాసీన వైఖరి అవలంభించారని పేర్కోన్నారు.
NTR: ప్రేమిస్తున్నానని నమ్మించి ఇంటర్ విద్యార్థినిని మోసగించిన సహ విద్యార్థిపై ఇబ్రహీంపట్నం పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ప్రేమ పేరుతో బాలికను శారీరకంగా లొబరుచుకొని, మరో అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడపడంతో బాలిక ఆత్యహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తమ కుమార్తెతో కలిసి ఇబ్రహీంపట్నం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెెలియాల్సి ఉంది.
KMM: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఖమ్మం నగరంలోని జెడ్పీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అయన పాల్గోని మాట్లాడారు. ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉన్నా తెలంగాణకు నిధులు తీసుకురాలేదని, దీనికి బీజేపీ ఎంపీలు సిగ్గుపడాలన్నారు.
KMM: మధిర నియోజకవర్గ నూతనంగా ఎన్నికైన ఆత్మ కమిటీ సభ్యులు సోమవారం మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ ఛైర్మన్ మల్లు నందిని విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమకి ఇంతటి చక్కని అవకాశం కల్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సహచరులపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసల వర్షం కురిపించాడు. జట్టు కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారని తెలిపాడు. ఫీల్డింగ్ విషయంలో వరుణ్ చక్రవర్తి చొరవ అద్భుతంగా ఉంటుందని కితాబిచ్చాడు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడని చెప్పుకొచ్చాడు.
KNRL: మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో వసంత పంచమిని పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహించారు. అర్చకులు బృందావనానికి వివిధ ఫలాలతో పంచామృత అభిషేకాలు, క్షీరాభిషేకాలు నిర్వహించారు. అనంతరం బృందావనానికి పూలు బంగారు కవచాలు పట్టు వస్త్రాలతో అలంకరించారు. శ్రీ మఠం పీఠాధిపతి నైవేద్యాలు సమర్పించి మంగళ హారతులు ఇచ్చారు.
KNRL: దేవనకొండ మండలంలోని కప్పట్రాళ్ల గ్రామంలో యురేనియం తవ్వకాల వల్ల వాతావరణం కలుషితమయ్యే ప్రమాదం ఉందని మానవహక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు VS.కృష్ణ, కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. ఈ రోజు కప్పట్రాళ్లలోని గ్రామస్తులతో సమావేశమై మాట్లాడారు. నీరు, గాలి కలుషితమవటం వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు.