VZM: కలెక్టరేట్‌లో ఇవాళ ప్రజల సమస్యల పరిష్కారం కోసం PGRS కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి నిన్న తెలిపారు. అధికారులు ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరిస్తారని, భూ సమస్యల కోసం ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ కూడా నిర్వహిస్తున్నామన్నారు. కలెక్టరేట్‌కు రాలేని వారు 1100 టోల్ ఫ్రీ నెంబర్, ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.
నెల్లూరులో సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ కె.రాఘవేంద్రం తెలిపారు. 0861 2320427 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు తెలిపితే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
KMM: రైతులకు ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సాదా బైనామా భూముల విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు రాబోయే కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చూపుతామని నిన్న ఆయన వెల్లడించారు. కొత్తగా తీసుకురానున్న ‘భూభారతి’ ద్వారా అన్ని త్రికాల సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు.
AP: ప్రధాని మోదీ ప్రజల మనసు గెలిచిన గొప్ప నాయకుడని మంత్రి అనగాని సత్యప్రసాద్ కొనియాడారు. ప్రభుత్వాధినేతగా మోదీ సాధించిన రికార్డులు ఆయన అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశం, ప్రజల సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధత అసమానమని, ఆయన పాలనలో దేశం తిరుగులేని రికార్డులను సొంతం చేసుకుందని మంత్రి ప్రశంసించారు.
TG: స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయంపై BJLP నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. MLA దానం నాగేందర్ పార్టీ మారలేదన్న స్పీకర్ నిర్ణయాన్ని క్వాష్ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఏలేటి పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు విచారణ జరపనుంది. కాగా పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఉన్న అందరూ ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
AKP: కశింకోట గవరపేటలో మద్యం మత్తులో గడ్డి మందు తాగి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రైతు బీసెట్టి సీతారాం (65) ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. ఈనెల 20వ తేదీన ఇంటి వద్ద గడ్డి మందు తాగి అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి విశాఖ కేజీహెచ్‌కు పంపించారు.
AKP: కశింకోట గవరపేటలో మద్యం మత్తులో గడ్డి మందు తాగి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రైతు బీసెట్టి సీతారాం (65) ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. ఈనెల 20వ తేదీన ఇంటి వద్ద గడ్డి మందు తాగి అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి విశాఖ కేజీహెచ్‌కు పంపించారు.
TPT: కోట హరిజనవాడలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నకేశ్వర స్వామి గుడి ఎదురుగా ఉన్న బర్రెల దొడ్డి పక్కన పిల్లలు టపాకాయలు పేల్చడంతో నిప్పురవ్వలు గడ్డివాముపై పడి మంటలు చెలరేగాయి. ఎండాకాలం కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. స్థానికులు అప్రమత్తమై వెంటనే బర్రెలను బయటకు తీసి రక్షించారు.పెద్ద ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
BDK: దుమ్ముగూడెం మండలం ప్రగల్లపల్లి పంచాయతీ రామచంద్రాపురంలో నిన్న విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పర్సకా వెంకటమ్మ, కల్లూరి బుచ్చమ్మలకు చెందిన తాటాకు ఇళ్లులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. రాత్రి 7గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు అప్రమత్తమై ఆర్పే ప్రయత్నం చేస్తుండగానే పూర్తిగా కాలిపోయింది. దీంతో బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు.
SRPT: తొలి విడతకు గాను రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అవి ట్రెజరీలకు చేరాయి. ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో ఈరోజు ఉదయం నుంచి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. మొదటి విడత సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 2,84,332 మంది రైతుల ఖాతాల్లో రూ.145 కోట్లు జమ కానున్నాయి. ఎకరా లోపు రైతులకు తొలి విడతలో బ్యాంకుల ద్వారా నేడు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని.
AP: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.హరిహరనాథ శర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికి మూలమూర్తి దర్శనం చేయించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
WGL: నర్సంపేట డివిజన్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఛైర్మన్ పిండం లక్ష్మీ రామానంద్ పాల్గొన్నారు. అనంతరం ఆమె క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ… గ్రామీణ ప్రతిభను వెలికితీసేందుకు తెలంగాణ ప్రభుత్వం క్రీడా పాఠశాలలను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. క్రీడాకారుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
KMR: బిక్కనూర్ శివారులో హైవేపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో కారు డివైడర్ పైకి ఎక్కింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురికి ఎలాంటి గాయాలు కాలేదు. జీఎంఆర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు.
వనపర్తి మండలం పెద్దగూడెంలో నేటి నుంచి 28 వరకు శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని అర్చకుడు రామన్ స్వామి తెలిపారు. 25న సీతారాముల కళ్యాణం, 27న రథోత్సవం, 28న చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ వేడుకలకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.
NLG: హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వెళ్తున్న సాయి అనే యువకుడు కేతేపల్లి మండలం ఉప్పలపహాడ్ వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సమాచారం అందుకున్న 108 సిబ్బంది వీరమణి, నాగాచారి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.