VZM: నామినేటెడ్ పదవుల్లో మహిళలకు కూటమి ప్రభుత్వం 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వబ్బిన సన్యాసినాయుడు సోమవారం ఓ ప్రకటనలో కోరారు. మూడో విడతలో ప్రభుత్వం ఇవ్వనున్న నామినేటెడ్ పదవుల్లో మహిళలకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు లేఖ రాసినట్లు తెలిపారు.