ప్రకాశం: పొదిలి పొగాకు వేలం కేంద్రంలో కొనుగోళ్లు మొదలయ్యాయి. బోర్డు వేలం నిర్వాహణాధికారి గిరి రాజ్ కుమార్ కొబ్బరి కాయకొట్టి కొనుగోళ్లు ప్రారంభించారు. క్లస్టర్లో సలక నూతల, కలగట్ల, వాగు మడుగు తదితర గ్రామాల నుండి తొలిరోజు 27 బేళ్లను అనుమతించారు. పొగాకు గరిష్ట ధర రూ. 280 పలికిందని వేలం నిర్వహణ అధికారి తెలిపారు.