NLR: ఎమ్మెల్యే కోటా శాసనమండలి సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు సమయంలో ఆయన వెంట ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పాశం సునీల్ కుమార్, కురుగొండ్ల రామకృష్ణ, కావ్యా కృష్ణారెడ్డి ఉన్నారు.