NDL: సంజామల మండల కేంద్రంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని సోమవారం ఏడీ డా. మోహన్ రావు ప్రారంభించారు. ఈనెల 30వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది, పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏడీ పేర్కొన్నారు. పశు వైద్యాధికారి డా. రాఘుబాలకృష్ణ, పశుసంవర్ధక కార్యదర్శులు మహబూబ్ బేగ్, ప్రభాకర్, అనిత పాల్గొన్నారు.