ప్రకాశం: అద్దంకిలో అంబేద్కర్ భవనం వద్ద సోమవారం సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత సావిత్రిబాయి పూలే చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ.. సావిత్రిబాయి పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని అన్నారు.