KMR: ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, రెండుపడక గదుల ఇళ్లు మంజూరు, రైతు భరోసా, మున్సిపల్ వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, మున్సిపల్ రోడ్లు ఆక్రమణ, తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి.