J&K అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సెషన్లో పహల్గామ్ దాడిని అసెంబ్లీ ఖండించనుంది. ఇప్పటికే అన్ని పార్టీల MLAలు అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత శర్మ మాట్లాడుతూ.. ఉగ్రదాడిలో చనిపోయిన 26 మందికి సంతాపం ప్రకటించడానికే ఈ సెషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉగ్రవాదులపై కేంద్రం తీసుకునే నిర్ణయంపై రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలుపుతామని చెప్పారు.