SKLM: జిల్లా మండల కేంద్రం సార్వకోట గాంధీజీ స్మారక గ్రంథాలయంలో సోమవారం వేసవి శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారిని డి. సాయము మాట్లాడుతూ.. పది సంవత్సరాల నుండి 15 సంవత్సరాలు వయస్సు గల పిల్లలకు జూన్ 6 వరకు ఈ ఉచిత శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు. ఆయనతోపాటు సహాయకుడు రామకృష్ణ పలువురు పదవీ విరమణ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.