VZM: గజపతినగరం మండలంలోని మరుపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన ఎల్లారమ్మ సినిమానోత్సవం వైభవంగా జరిగింది. పూజార్లు సినిమాలను అధిరోహించి మూడుసార్లు తిరిగే సమయంలో భక్తులు అరటి పండ్లు దుంపలు విసిరి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుంచి ఎల్లారమ్మ, పరశురామన్న ఆలయాల వద్ద భక్తులతో కిటకిట లాడాయి.