సత్యసాయి: జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం జువాలజీ, గణితం 2B, పరీక్షలకు 103 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్మీడియట్ విద్యాధికారి రఘునాథరెడ్డి తెలిపారు. సోమవారం జరిగిన పరీక్షకు సెట్-2 ప్రశ్నాపత్రాలను వినియోగించినట్లు ఆయన పేర్కొన్నారు. 6,339 మంది విద్యార్థులకు గానూ 6,236 మంది విద్యార్థులు హాజరయ్యారని వెల్లడించారు.