• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ఉద్యోగులకు రూ.25 వేలకోట్ల బకాయిలు చెల్లించాలి’

కాకినాడ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం రూ.25వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కెఆర్‌.సూర్యనారాయణ తెలిపారు. ఆదివారం స్థానిక అంబేద్కర్‌ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా 3వ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగ సమస్యలకు సంబంధించి విషయాలను ఆయన మీడియాకు వివరించారు.

February 3, 2025 / 05:42 AM IST

భారత మహిళల జట్టుకు CM శుభాకాంక్షలు

AP: U-19 భారత మహిళల జట్టుకు CM చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. అంకిత భావం, దేశభక్తిని వారి ఆటలో ప్రదర్శించారని కొనియాడారు. ప్రతి భారతీయడు గర్వంగా చెప్పుకునేలా ప్లేయర్లు ఆడారని.. మరచిపోలేని విజయాన్ని అందించారని పేర్కొన్నారు. కేవలం దేశానికి పేరు తేవడమే కాకుండా, లెక్కలేనంత మంది మహిళా క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చారని అన్నారు.

February 2, 2025 / 08:25 PM IST

బాలుడి ఆవిష్కరణకు సీఎం రేవంత్ ప్రశంస

HYD: హైబ్రిడ్ సైకిల్‌ను రూపొందించిన 14 ఏళ్ల చిన్నారి గగన్ చంద్రను సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ఈ చిన్నారి ఆవిష్కరణ తన దృష్టిని ఆకర్షించిందని ట్వీట్ చేశారు. అతనికి అభినందనలు తెలిపారు. మరిన్ని పరిశోధనలు, ఆవిష్కరణలు చేసేందుకు గగనకు మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నారు. కాగా గగన్ సోలార్, బ్యాటరీ, పెట్రోల్తో నడిచే సైకిల్‌ను రూపొందించాడు.

February 2, 2025 / 08:03 PM IST

‘మారుమూల గ్రామాల రూపు రేఖలు మారుస్తాం’

NRML: మారుమూల గ్రామీణ ప్రాంతాల రూపు రేఖలను మార్చడానికి ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందనీ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. ఆదివారం పెంబి పట్టణ కేంద్రంతో పాటు మండలంలోని గుమ్మెన, ఎంగులాపూర్, చాకిరేవు, వస్ పల్లి, దొత్తి వాగు, పసుపుల నాయకపు గూడ,కొలంగూడ, హరిచంద్ తండా గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు.

February 2, 2025 / 07:43 PM IST

ఘనంగా శ్రీ సీతారామ, ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ

KDP: వేముల పంచాయతీ పరిధిలోని శేషన్నగారిపల్లెలో ఆదివారం శ్రీ సీతారామ, ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు ఘనంగా జరిగాయి. విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా పురోహితులు ఆలయంలో శ్రీ సీతారామ, ఆంజనేయస్వామి విగ్రహాలను ప్రతిష్టించి హోమాలు పూజారి కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివార్లను భక్తులు, వైసీపీ శ్రేణులు దర్శించుకుని కాయ కర్పూరాలు సమర్పించారు.

February 2, 2025 / 07:40 PM IST

‘జానపద సాహిత్య పరిశోధన శిఖరం ఆచార్య తంగిరాల’

KDP: జానపద సాహిత్య పరిశోధనా శిఖరం ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు అని వివిధ సంఘాల పార్టీ నేతలు కొనియాడారు. రేనాటి సూర్యచంద్రుల విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన తంగిరాల సుబ్బారావు సంస్మరణ సభ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. తొలిత చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు.

February 2, 2025 / 07:39 PM IST

‘అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి’

MDK: శివంపేట మండలం సామ్య తండాలో మదన్ (35) అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. తల్లిదండ్రులు గతంలో మృతి చెందగా, కుటుంబ కలహాల కారణంగా మదన్ భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. ఒంటరిగా ఉన్న మదన్ అనుమానస్పదంగా మృతి చెందారు. హత్య చేసినట్లుగా పలువురు అనుమానిస్తున్నారు.

February 2, 2025 / 07:27 PM IST

‘వైద్యులు అందుబాటులో ఉండాలి.. రోగులకు సేవలందించాలి’

MDK: వైద్యులు అందుబాటులో ఉండాలని, రోగులకు సేవలందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్యాధికారులను ఆదేశించారు. రామాయంపేట సి.హెచ్.సీను కలెక్టర్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానలోని మందులు అందించే గది, రక్త పరీక్షలు చేసే ల్యాబ్, ఇన్ పేషెంట్ వార్డ్, మందులు నిల్వ చేసే స్టోర్‌రూంను పరిశీలించారు.

February 2, 2025 / 07:22 PM IST

గూడూరు తాళమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు

TPT: గూడూరు గ్రామ దేవత శ్రీ తాళమ్మ అమ్మవారికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు అర్చనలు అలంకారాలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో గూడూరు గ్రామ శివారులో కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

February 2, 2025 / 07:21 PM IST

బాలయ్యను కలిసిన వీరాభిమాని జగన్

ATP: హీరో నందమూరి బాలకృష్ణను అనంతపురానికి చెందిన ఆయన వీరాభిమాని జగన్ కలిశారు. బాలయ్యకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. తమ అభిమాన హీరోకు దేశంలోని అత్యున్నత పురస్కారం రావడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. బాలయ్యకు వైద్య సేవల్లోనూ అవార్డు వరించాలని ఆకాంక్షించారు.

February 2, 2025 / 07:17 PM IST

శ్రీ సూర్యనారాయణమూర్తికి విశేష పూజలు

VZM: విజయనగరం స్థానిక బాబామెట్టలో గల శ్రీ శివ పంచాయతన దేవాలయంలో ఆదివారం మాఘ మాసం మొదటి వారం పర్వదిన సందర్భంగా అర్చకులు సుప్రభాత సేవ అనంతరం శ్రీ సూర్యనారాయణమూర్తికి అభిషేకాలు, అర్చనలు చేశారు. భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో కేఏపీ రాజు, శివ, నారాయణ రావు, సాంబరాజ పాల్గొన్నారు.

February 2, 2025 / 07:16 PM IST

అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి

KDP: సింహాద్రిపురం మండలం బిదినం చెర్ల గ్రామంలో పార్వతమ్మ(80)అనే వృద్ధురాలు అనుమానస్పద స్థితిలో మృతి చెందినది. మృతురాలి ఇంటికి గత 4రోజులుగా తాళం వేసి ఉండగా ఇంటిలో నుంచి దుర్వాసన వస్తుంటే స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 2, 2025 / 07:04 PM IST

అగ్ని ప్రమాదంలో కాలిపోయిన మిషన్ భగీరథ పైపులు

SRD: మునిపల్లి మండలం బుదేరా సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. అక్కడే ఉన్న మిషన్ భగీరథ పైపులకు మంటలు వ్యాపించడంతో మంటలు వ్యాపించాయి. అగ్నికి పైపులు దగనమవడంతో మంటలు పెద్ద ఎత్తున అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలను ఆర్పివేశారు.

February 2, 2025 / 07:04 PM IST

బడ్జెట్‌పై స్పందించిన అనకాపల్లి ఎంపీ

AKP: కేంద్రం ప్రకటించిన 2025-26 బడ్జెట్ కేటాయింపులపై అనకాపల్లి ఎంపీ డాక్టర్ CM.రమేష్ స్పందించారు. ఇది 140 కోట్ల ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్, నూటికి నూరు శాతం అభివృద్ధి బడ్జెట్ అని ప్రత్యేకంగా కొనియాడారు. రూ.12 లక్షల వరకు ఆదాయంపై పూర్తిగా పన్నుమినహాయింపు ప్రకటించడం ద్వారా మధ్య తరగతి ప్రజలకు భారీ ఊరట కల్పించిందని పేర్కొన్నారు.

February 2, 2025 / 06:57 PM IST

సంగారెడ్డిలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన

SRD: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్ ముందు ఆదివారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్కా రాములు మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదని విమర్శించారు.

February 2, 2025 / 06:55 PM IST