MDK: వైద్యులు అందుబాటులో ఉండాలని, రోగులకు సేవలందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్యాధికారులను ఆదేశించారు. రామాయంపేట సి.హెచ్.సీను కలెక్టర్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానలోని మందులు అందించే గది, రక్త పరీక్షలు చేసే ల్యాబ్, ఇన్ పేషెంట్ వార్డ్, మందులు నిల్వ చేసే స్టోర్రూంను పరిశీలించారు.