SRD: జహీరాబాద్ నిమ్జ్ పరిధిలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను అనుసంధానిస్తూ మౌలిక సదుపాయాల ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. ఎస్పీ పరితోష్ పంకజ్‌తో కలిసి క్యాంపు కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. సర్వే పనులు వేగవంతం చేసేందుకు రెవెన్యూ సర్వే పోలీస్ శాఖల సమన్వయంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
W.G: నరసాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా రిజిస్ట్రార్ జి.శివయ్య బుధవారం సందర్శించి, రికార్డులను తనిఖీ చేశారు. వార్షిక ఆదాయం, రిజిస్ట్రేషన్ల విధానంపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, భీమవరం పరిధిలోని 15 కార్యాలయాల ద్వారా ఈ నెల 23 నాటికి రూ.425 కోట్ల రెవెన్యూ వచ్చినట్లు వెల్లడించారు. అనంతరం విధుల్లో పారదర్శకత పాటించాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు.
CTR: చిత్తూరులో బుధవారం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ‘మై భారత్ కేంద్రం వారు కాశ్మీర్ యూత్ ఎక్స్చేంజ్’ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ.. భారతదేశానికి విలువైన సంపద యువతే అని అన్నారు. ఈ క్యాక్రమంలో 132 మంది కాశ్మీరీ యువత పాల్గొన్నారు.
SKLM: పోలాకి మండలంలోని పలు గ్రామాలలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ కూటమి ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తుందని ఎమ్మెల్యే రమణ మూర్తి అన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే పంచాయతీలకు చెత్త సేకరణ ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. గ్రామాల్లో పారిశుధ్య మెరుగుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
NTR: రైతులు వైవిధ్య పంటల సాగుతో సుస్థిర వ్యవసాయానికి బాటలు వేసి అధిక దిగుబడి, నికరాదాయం పొందాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు సూచించారు. గుంటుపల్లిలో రైతన్నా.. మీకోసం కార్యక్రమంలో బుధవారం పాల్గొన్నారు. అనంతరం వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్లలో నీరు ఉన్న నేపథ్యంలో మే 15 నుంచి ముందస్తు సాగు మొదలు పెట్టాలని కోరారు.
AP: PNG వాడకాన్ని పెంచేందుకు ఏడాదికి రూ.2400 సబ్సిడీ ఇచ్చేలా DBT పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సీఎస్ సాయి ప్రసాద్ తెలిపారు. LPGపై ఆధారపడడాన్ని తగ్గించే చర్యలు చేపడుతున్నామని, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అనుమతులను సరళం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు 10 వేల PNG కనెక్షన్‌లు లక్ష్యంగా పెట్టుకున్నామని, వాణిజ్య, పరిశ్రమలకు విస్తరిస్తామన్నారు.
JGL: జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత అధ్యక్షతన విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఎస్సీ/ ఎస్టీ అట్రాసిటీ కేసులను జాప్యం లేకుండా పరిష్కరించి బాధితులకు న్యాయం అందించాలని ఆదేశించారు. జిల్లాలో 575 బాధిత కుటుంబాలకు రూ.4.52 కోట్ల సాయం మంజూరు చేసినట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 192 కుటుంబాలకు వెంటనే నిధులు విడుదల చేసి అందిస్తామన్నారు.
VZM: జిల్లాలో గృహల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులని ఆదేశించారు. ముఖ్యంగా లేఅవుట్లపై దృష్టి పెట్టాలని, లబ్ధిదారులను చైతన్య పరిచి అసంతృప్తిగా ఉన్న సుమారు 17,000 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయించేందుకు కృషి చేయాలని చెప్పారు. లబ్ధిదారులతో ప్రతి శనివారం అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
KDP: సింహాద్రిపురంలో ఓ ఇంటి ముందర గ్యాస్ సిలిండర్‌కు వినియోగదారుడు గొలుసు తాళం వేశాడు. గ్యాస్ సిలిండర్లు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి సోమవారం సింహాద్రిపురానికి గ్యాస్ సరఫరా అయ్యేది. పది రోజులుగా సిలిండర్లు రాకపోవడంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. గ్యాస్ ఎప్పుడు వస్తుందో తెలియక గేటుకు సిలిండర్ను కట్టేసి ఉంచారు.
MBNR: మన్యంకొండలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ.44,90,043 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆలయ అభివృద్ధికి నిధులు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్, ఈవో శ్రీనివాసరాజు, ఇన్‌స్పెక్టర్ వీణా ధరణి, అలహరి రామకృష్ణ, ఐడీబీఐ బ్యాంక్ మేనేజర్ పాల్గొన్నారు.
SDPT: వర్గల్ మండలం వేలూరు గ్రామంలో కుక్కల దాడిలో 23 మేక పిల్లలు మృతి చెందాయి. బుధవారం రైతులు మల్లేశం, కృష్ణ మేకలను మేతకు తీసుకెళ్లి, పిల్లలను దొడ్డిలోనే ఉంచారు. ఈ క్రమంలో వీధి కుక్కలు మేకల దొడ్డిలో దూరి పిల్లలను చంపేశాయి. సాయంత్రం వచ్చి చూసేసరికి మూగజీవాలు రక్తపు మడుగులో ఉండటంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని కోరారు.
NGKL: జిల్లాలోని అర్హులైన రైతులందరికీ పంట రుణాలను విరివిగా అందించాలని అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో ఉన్న నేపథ్యంలో బ్యాంకుల అనుసంధానంతో అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రాధాన్య పథకాల లక్ష్యాలను బ్యాంకర్లు పూర్తి చేయాలన్నారు.
BDK: బూర్గంపాడు మండలం సారపాక మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్ బుధవారం సారపాక ప్రధాన రహదారి వెంబడి చెట్లను నాటారు. ప్రతి ఒక్కరు తమ వంతుగా మొక్కలు నాటి సంరక్షించాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కిషోర్ నాయక్‌తో పాటు ఉప సర్పంచ్ కన్నదారి, రమేష్ ఈవో మహేష్, వార్డ్ మెంబర్ మువ్వా వెంకటేశ్వర్లు పంచాయతీ సిబ్బంది ఉన్నారు.
KKD: దేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ రాజ్యసభలో తెలిపారు. ఎంపీ సానా సతీష్ బాబు అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానంగా ఈ వివరాలు వెల్లడించారు. మహిళల భద్రత, ఆర్థిక సాధికారత, ఉపాధి అవకాశాల పెంపుపై దృష్టి సారిస్తున్నామని ఆయన వెల్లడించారు.
PDPL: ఏప్రిల్ 2న జరగనున్న ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక గ్రామసభలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గ్రామాల్లో 4 రోజుల ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించి పరిశుభ్రతను మెరుగుపరచాలని సూచించారు. ప్రతి మండలంలో కనీసం 100 ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశానికి సిద్ధం చేయాలని, పన్ను వసూళ్లు 100%కి చేరుకోవాలన్నారు.