BDK: నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. అసెంబ్లీ స్థానాలు 10 నుంచి 15 కు పెరిగే అవకాశముండటంతో బూర్గంపాడు, భద్రాచలం, పాల్వంచ ప్రాంతాలను కలిపి కొత్త సీటు ఏర్పాటు చేసే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. గతంలో నియోజకవర్గంగా ఉన్న బూర్గంపాడును మళ్లీ నియోజకవర్గంగా చేయాలని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.