• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

క్షయ నిర్మూలనలో జగిత్యాలకు ‘స్టేట్ అవార్డు’

JGL: వరల్డ్ TB డే సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నిర్వహించిన వేడుకల్లో జగిత్యాల జిల్లా సత్తా చాటింది. క్షయ వ్యాధి నిర్మూలనలో విశేష కృషి చేసినందుకు రాష్ట్రస్థాయిలో జిల్లా 3వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ సందర్భంగా జిల్లా ఉప వైద్యాధికారి డా.శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది సమష్టి కృషితోనే ఈ అవార్డు దక్కిందని హర్షం వ్యక్తం చేశారు.

March 25, 2026 / 06:30 PM IST

‘బ్రిడ్జి నిర్మాణం వేగవంతం చేయండి’

GDWL: ధరూర్ మండలం నీలహళ్లి వాగు బ్రిడ్జి నిర్మాణం పడకేసింది. కాంట్రాక్టర్కు చెల్లింపులు నిలిచిపోవడంతో పనులు అర్థాంతరంగా ఆగిపోయాయి. ఈ అసంపూర్తి కట్టడం వల్ల రాత్రి వేళల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల క్రితం ఇక్కడ జరిగిన ప్రమాదమే ఇందుకు నిదర్శనమని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

March 25, 2026 / 06:30 PM IST

‘శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి’

MDK: గ్రామ పంచాయతీల వార్డు సభ్యులు ప్రభుత్వం ఇస్తున్న శిక్షలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని జెడ్పీ సీఈవో ఎల్లయ్య పేర్కొన్నారు. పెద్ద శంకరంపేట రైతు వేదికలో నిర్వహిస్తున్న వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి వార్డు సభ్యులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో క్రాంతి కుమార్ పాల్గొన్నారు.

March 25, 2026 / 06:30 PM IST

నిలువు రాళ్ళను సందర్శించిన విద్యార్థులు

NRPT: కృష్ణా మండలంలోని ముడుమల్ గ్రామంలో ప్రాచీన నిలువు రాళ్ళను ధన్వాడ మండలంలోని మంది పల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా వాటి చరిత్రను ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేశారు. నిలువు రాళ్ల నీడను ఆధారంగా గతంలో సమయాన్ని సూచించే వారిని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం నరసింహులుతో పాటు ఉపాధ్యాయులు ఉన్నారు.

March 25, 2026 / 06:30 PM IST

‘అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు చేపట్టాలి’

ADB: పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బుధవారం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరాలను త్వరితగతిన ఛేదించడానికి సీసీటీవీ కెమెరాలు ఉపయోగపడతాయన్నారు. ఆర్థిక నేరాలు దొంగతనాలు జరగకుండా పటిష్టమైన గస్తీ నిర్వహించాలని సూచించారు.

March 25, 2026 / 06:28 PM IST

వెలుగుబంధలో ఎమ్మెల్యే బత్తుల పల్లెబాట

E.G: రాజానగరం మండలం వెలుగుబంధలో బుధవారం MLA బత్తుల బలరామకృష్ణ ‘మన ఊరు-మన ఎమ్మెల్యే-మన పల్లెబాట’ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనవాణి ద్వారా త్రాగునీరు, సాగునీరు, పెన్షన్, ఇళ్ల స్థలాలపై గ్రామస్థులు ఇచ్చిన వినతులను ఆయన స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే, వేసవిలో నీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

March 25, 2026 / 06:27 PM IST

శ్రమయే విజయానికి మార్గం: ఎస్పీ నరసింహ

SRPT: విజయానికి అడ్డదారులు ఉండవని విజయం సాధించాలంటే శ్రమయే మార్గమని, విద్యార్థులు నిత్యం శ్రమించాలని ఎస్పీ నరసింహ అన్నారు. బుధవారం సూర్యాపేటలోని స్పందన డిగ్రీ, పీజీ కళాశాల వార్షికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యం సాధించడానికి మంచి ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. పాఠ్యంశాలపై విషయ పరిజ్ఞానం కలిగి ఉండాలని సూచించారు.

March 25, 2026 / 06:26 PM IST

గుడి పరిసరాలను పరిశీలించిన తాహసీల్దార్

WGL: నల్లబెల్లి (M) కన్నారావుపేటలోని ఆలయ పరిసర ప్రాంతాన్ని బుధవారం తాహసీల్దార్ కృష్ణ సందర్శించారు. ఆలయ కమిటీ సభ్యుల నిర్ణయం మేరకు భక్తుల సౌకర్యార్థం రేకుల షెడ్ నిర్మాణం కోసం గుడి స్థలాన్ని చదును చేసినట్లు గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అవసరమైన అనుమతులు తీసుకుని మాత్రమే నిర్మాణ పనులు చేపట్టాలని ఆయన గ్రామస్తులకు సూచించారు.

March 25, 2026 / 06:25 PM IST

2.8 సెకన్లలో 0-96 kmph వేగం!

అమెరికా కంపెనీ రైన్ మోటర్స్ FP3 అనే కారును విడుదల చేసింది. అమెరికా రిజిస్ట్రేషన్ నిబంధనలను అనుసరించి త్రీవీలర్‌గా వస్తోంది. ఇందులో సుజుకీ హయబుసా 1,340 సీసీ ఫోర్ సిలిండర్ ఇంజిన్ అమర్చారు. ఫైబర్‌గ్లాస్ బాడీతో వస్తోంది. ఈ కారు 2.8 సెకన్లలోనే 0-96 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. FP3 బేస్ మోడల్ రూ.73.72 లక్షల నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ పేర్కొంది.

March 25, 2026 / 06:24 PM IST

ఎస్సీ యాక్షన్ ప్లాన్ దరఖాస్తు గడువు పొడిగింపు

KMR: జిల్లాలో 2025-26 ఎస్సీ యాక్షన్ ప్లాన్ ఫేజ్-1 దరఖాస్తు గడువును ఏప్రిల్ 2 వరకు పొడిగించినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. అలాగే ఫేజ్-2 కింద డ్రోన్లు,డైరీ, ఈవీ వాహనాలు,వ్యవసాయ పనిముట్ల వంటి పథకాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హులైన SC నిరుద్యోగ యువత OBMMS పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకుని, ఆ ఫారాలను MPDO కార్యాలయంలో సమర్పించాలి.

March 25, 2026 / 06:23 PM IST

‘పోలీస్ శాఖ పాత వస్తువుల వేలం’

గుంటూరు జిల్లా పోలీస్ శాఖ పాత వస్తువుల బహిరంగ వేలం మార్చి 26న నిర్వహించనుంది. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు సాయంత్రం 4 గంటలకు RI స్టోర్‌లో ఈ వేలం జరుగుతుంది. టెంట్లు, కుర్చీలు, సమియానాలు, ప్లాస్టిక్ డ్రమ్ములు, ఫ్యాన్లు, టార్చ్‌లైట్లు తదితర వస్తువులు ఈ వేలంలో అందుబాటులో ఉంటాయి. ఆసక్తి గల వారు పాల్గొని కొనుగోలు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

March 25, 2026 / 06:22 PM IST

ఆహార నాణ్యతపై ఆకస్మిక తనిఖీ చేసిన కమిషనర్

కడప: నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర జడ్పీ ప్రాంగణంలోని అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన క్యాంటీన్‌లో అందిస్తున్న భోజనాన్ని స్వయంగా తీసుకుని ప్రజలతో కలిసి భోజనం చేశారు. ఆహార నాణ్యత, పరిశుభ్రత, వంట విధానాన్ని పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. లబ్ధిదారులతో మాట్లాడి సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు.

March 25, 2026 / 06:22 PM IST

సిద్దేశ్వరాలయ హుండీ లెక్కింపు

JN: బచ్చన్నపేట మండలంలోని స్వయంభూ శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ హుండీలను ఆలయ ప్రాంగణంలో ఇవాళ లెక్కించారు. 80 రోజులకు గాను ఆలయ హుండీ ద్వారా రూ.3,59,197 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో చిందం వంశీ వెల్లడించారు. భువనగిరి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ నిఖిల్ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగిందని పేర్కొన్నారు.

March 25, 2026 / 06:22 PM IST

కోసిగిలో ట్రైనీ ఎస్సైగా ధనుంజయ బాధ్యతలు

KRNL: గ్రూప్-2 నియమాకాల ద్వారా ఎంపికైన ట్రైనీ ప్రొహిబిషన్, ఎక్సైజ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఎస్. ధనుంజయ బుధవారం కోసిగి ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్‌లో బాధ్యతలు స్వీకరించి శిక్షణ ప్రారంభించారు. పెద్దకడబూరు గ్రామానికి చెందిన ఆయనను ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ పి. భార్గవ రెడ్డి అభినందించారు. శిక్షణ కాలాన్ని సద్వినియోగం చేసుకుని శాఖ విధులు నేర్చుకోవాలని సూచించారు.

March 25, 2026 / 06:21 PM IST

DCCB బడ్జెట్‌కు ఆమోదం

HNK: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (DCCB) మహాజనసభ కలెక్టర్ ,బ్యాంక్ ఇన్‌ఛార్జ్ చాహత్ బాజ్‌పాయ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు వార్షిక నివేదికతో పాటు నూతన బడ్జెట్ ప్రతిపాదనలకు సభ ఆమోదం తెలిపింది. బ్యాంకు లాభాల బాటలో పయనిస్తోందని, రైతులకు డ్రోన్లు, జనౌషధి కేంద్రాల ఏర్పాటుకు తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

March 25, 2026 / 06:21 PM IST