JN: బచ్చన్నపేట మండలంలోని స్వయంభూ శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ హుండీలను ఆలయ ప్రాంగణంలో ఇవాళ లెక్కించారు. 80 రోజులకు గాను ఆలయ హుండీ ద్వారా రూ.3,59,197 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో చిందం వంశీ వెల్లడించారు. భువనగిరి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ నిఖిల్ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగిందని పేర్కొన్నారు.