ADB: పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బుధవారం టూ టౌన్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరాలను త్వరితగతిన ఛేదించడానికి సీసీటీవీ కెమెరాలు ఉపయోగపడతాయన్నారు. ఆర్థిక నేరాలు దొంగతనాలు జరగకుండా పటిష్టమైన గస్తీ నిర్వహించాలని సూచించారు.