ATP: ప్రభుత్వ పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీలకు అందాల్సిన లబ్ధిని నిష్పక్షపాతంగా, పూర్తిస్థాయిలో అందించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిర్దేశించిన శాతం ప్రకారం నిధులను ఖచ్చితంగా ఖర్చు చేయాలన్నారు. ఉపాధి హామీ, గృహ నిర్మాణ పథకాల్లో వీరికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.