WGL: కాపు న్యాయ వేదిక జిల్లా అధ్యక్షురాలిగా కరీమాబాద్‌కు చెందిన స్వరూప నియమింపబడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమా రాజేందర్ ఈరోజు ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రం, దేశంలో మహిళా నాయకత్వాన్ని పెంచాలనే లక్ష్యంతో స్వరూపను నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చట్ట సభలకు మహిళలు వెళ్ళే విధంగా కృషిచేయాలని సూచించారు.
WNP: స్పెషల్ బ్రాంచ్ విభాగం జిల్లా పోలీస్ వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తుందని, క్షేత్రస్థాయిలో సిబ్బందికి అవసరమైన సమాచారాన్ని అందిస్తూ నేర, నియంత్రణలో ముఖ్యమైన సహకారం అందిస్తుందని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. బుధవారం వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రజలకు స్పెషల్ బ్రాంచ్ భరోసా కల్పించాలన్నారు.
ADB: జిల్లాలో గత ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలకు అన్నదాతకు తీరని నష్టం వాటిల్లిందని MLA పాయల్ శంకర్ అన్నారు. దీంతో పంట దిగుబడి తగ్గిపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారని పేర్కొన్నారు. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో MLA పాయల్ శంకర్ మాట్లాడారు. ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలియజేశారు.
యాంకర్ శ్రీముఖి కొత్త అవతారమెత్తింది. గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్‌లోని ఐటీ హబ్ మాదాపూర్‌లో తన స్నేహితులతో కలిసి ‘ఫుర్సత్’ అనే గ్రాండ్ రెస్టారెంట్‌ను ప్రారంభించింది. సరసమైన ధరలకే నాణ్యమైన ఆహారాన్ని అందించడమే తమ లక్ష్యమని శ్రీముఖి పేర్కొంది.
NLG: దేవరకొండ ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో బుధవారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగితే అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అధ్యక్షుడు సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్ఎఫ్ఐ నాయకులను విడుదల చేయాలన్నారు.
KMR: కామారెడ్డి రాజీవ్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలు, మందుల లభ్యత, రిజిస్టర్లను స్వయంగా పరిశీలించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత పాటించాలని, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తూనే, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.
ATP: గుంతకల్లు పట్టణంలోని కాకతీయ పాఠశాల ఎదుట బుధవారం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ.. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న పాఠశాలను వెంటనే సీజ్ చేయాలని వారి డిమాండ్ చేశారు.
NRML: కడెం మండలంలో వీర హనుమాన్ విజయ యాత్ర వైభవోపేతంగా కొనసాగింది. ఈ వీ హెచ్పీ, భజరంగ్ ధల్ ఆధ్వర్యంలో మండలంలోని పాండ్వాపూర్ నుంచి పెద్దుర్ వరకు రాముడి ప్రతిమ, హనుమాన్ ప్రతిమతో భారీ ర్యాలీ కొనసాగింది. ముందుగా ప్రతిమలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జై శ్రీ రాం అంటూ భక్తులు నినాదాలు చేశారు.
VZM: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు యువత బలికావద్దని ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ యువతకు బుధవారం పిలుపునిచ్చారు. ఈనెల 28 నుంచి ఐపీల్ మ్యాచ్ ప్రారంభంకానున్న నేపథ్యంలో బెట్టింగ్‌లకు గురికావద్దని ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని కోరారు. అలాగే, బెట్టింగ్ యాప్‌ల వల్ల జీవితాలు నాశనం అవుతాయని హెచ్చరించారు.
MBNR: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి ఐదు రూపాయల భోజనం కేంద్రం శిథిలావస్థకు చేరుకోవడంతో డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన సొంత డబ్బులతో పేద ప్రజలు తినేందుకు ఏర్పాటు చేయిస్తారని వెల్లడించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు మైత్రి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
ASR: ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన చట్టాలను ఉల్లంఘిస్తూ బినామీల పేర్లతో నడుస్తున్న ఆర్కా రిసార్ట్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కలెక్టరేట్‌కు కేటాయించాలని సీపీఎం ప్రాంతీయ కమిటీ కన్వీనర్ వాణిశ్రీ బుధవారం డిమాండ్ చేశారు. పీసా చట్టం ప్రకారం గ్రామసభ అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు.
TPT: చంద్రగిరి గ్రామదేవత శ్రీమూలస్థాన ఎల్లమ్మ తల్లి ఆలయంలో పూర్ణాహుతి కలశాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు హాజరయ్యారు. వారికి ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి వేదపండితులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
టీమిండియా స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తన కమ్‌బ్యాక్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను జట్టుకు దూరమైన సమయంలో కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని అన్నాడు. నిరంతరం శ్రమిస్తూ సరైన అవకాశం కోసం వేచి చూశానని ఇషాన్ వెల్లడించాడు. ఈ ప్రయాణం మొత్తం తనపై తనకు ఉన్న నమ్మకం వల్లే సాధ్యమైందని తెలిపాడు.
NGKL: సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి జయంతిని జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. సోషలిజం సాధనకు ఆయన చేసిన కృషి యువతకు ఆదర్శమని, సురవరం స్ఫూర్తితో పేదల పక్షాన పోరాటాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా నాయకులు ప్రతిజ్ఞ చేశారు.
SRPT: నూతనకల్ మండలం చిల్పకుంట్లలోని మిషన్ భగీరథ 20 ఎంఎల్డీ ప్లాంట్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్లు తమ వేతనాలను చెల్లించాలని బుధవారం కలెక్టర్‌కు ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. ఐదు నెలలుగా పెండింగ్ వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమేష్, హరికృష్ణలు అన్నారు.