ATP: గుంతకల్లు మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా శనివారం సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసులు మాట్లాడుతూ.. పట్టణంలో ఎయిర్టెల్, ఫైబర్ నెట్‌వర్క్ పేరుతో రోడ్లన్నీ తవ్వి గుంతల మయం చేస్తున్నారన్నారు. తవ్విన గుంతలను పూడ్చకుండా అలాగే వదిలేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. తక్షణమే గుంతలను పూడ్చాలని డిమాండ్ చేశారు.
KRNL: ఆలూరులో జరుగుతున్న ఏఐటీయూసీ 24వ జిల్లా మహాసభలకు కోడుమూరు మండలం నుంచి సీపీఐ, ఏఐటీయూసీ నేతలు శనివారం తరలివెళ్లారు. ఎర్రజెండాలు చేతబూని నినాదాలు చేస్తూ బయలుదేరిన కార్యకర్తలు మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కార్మికులు, వామపక్ష నాయకులు పెద్దఎత్తున హాజరవుతున్నారని వారు తెలిపారు.
MDK: రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షిత ప్రయాణం కల్పించాలనే లక్ష్యంతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘Arrive Alive’ కార్యక్రమాన్ని మెదక్‌లో నిర్వహించారు. రహదారి వినియోగదారుల్లో ట్రాఫిక్ భద్రతపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆటో, బస్సు, లారీ డ్రైవర్లు, పోలీస్ సిబ్బందికి కంటి పరీక్ష నిర్వహించారు.
KNR: కరీంనగర్ సుభాష్ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ నీలి మల్లేశం శనివారం గుండెపోటుతో మరణించారు. మృతుడిపై భార్య, ఇద్దరు పిల్లలు, వృద్ధురాలైన తల్లి ఆధారపడి ఉన్నారు. బాధిత కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో డ్రైవర్ల యూనియన్ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మధ్యల రాజేందర్, నెల్లి పెద్దలు, బొగ్గుల మల్లేశం, మేకల మల్లేశంలు కోరారు.
GDWL: రాజోలి మండలంలో మహిళలను అక్షరాస్యులుగా మార్చే ‘ఉల్లాస్’ పథకం ముగింపు పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. మొత్తం 1,598 మంది మహిళలు పరీక్ష రాయనుండగా, ఇందుకోసం 11 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో అబ్దుల్ సాయీద్ ఖాన్ తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు VOAల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతాయని, అధికారులు కేంద్రాలను తనిఖీ చేస్తారని పేర్కొన్నారు.
MDCL: అల్వాల్ పట్టణంలో టెంపుల్ అల్వాల్లో గల హరిదాసు మండపంలో 75వ శ్రీ సీతారామ వసంత నవరాత్రి ఉత్సవంలో భాగంగా శనివారం స్వామివారికి అభిషేకం, సామ్రాజ్య పట్టాభిషేకంను బ్రహ్మశ్రీ మిరియంపల్లి వరుణ్ కుమార్ శర్మ గావించారు. సత్యనారాయణ స్వామి వ్రతం, సాయంత్రం అన్న ప్రసాద వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామ సంకీర్తన సంఘ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
SRCL: వచ్చే ఏప్రిల్ 7న వేములవాడ పరిధి తిప్పాపూర్‌లోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన తిప్పాపూర్ లోని గోశాలలో కోడెలను పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఒక ప్రకటనలో తెలిపారు. వేములవాడ తిప్పాపూర్ గోశాలలోని మధ్యస్థం నుంచి పెద్దగా ఉన్న 300 కోడెలు మంగళవారం ఉదయం 07.00 గంటలకు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్‌గా ఎం. విజయ సునీత శనివారం కలెక్టరేట్‌లోని ఆమె కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆమెకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన పాలన అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
ASF: ఆసిఫాబాద్ జిల్లాలో సర్వర్ల నిర్వహణ పనుల కారణంగా ‘మీ-సేవ’ సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. ఏప్రిల్ 3వ తేదీ రాత్రి 8 నుంచి 5వ తేదీ ఉదయం 8 గంటల వరకు ఈ అంతరాయం ఉంటుందని అధికారులు శనివారం ప్రకటనలో తెలిపారు. సాంకేతిక మెరుగుదలకై ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు తమకు అవసరమైన సర్టిఫికెట్లు, ఇతర సేవలను ఈ గడువు కంటే ముందే పూర్తి చేసుకోవాలని సూచించారు.
SRPT: హుజూర్‌నగర్ కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి మారుతి ప్రసాద్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన్ కీలక సూచనలు చేశారు. కక్షిదారులకు సత్వరమే న్యాయం అందించడమే లోక్ అదాలత్‌ల ప్రధాన లక్ష్యమన్నారు. తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా రాజీ మార్గంలో పరిష్కరించుకోవలాన్నారు.
CTR: పుంగనూరులో ఈనెల 31న బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు కమిషనర్ మధుసూదన్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ బస్టాండ్, పుంగమ్మ చెరువు ట్యాంక్ వద్ద గల పబ్లిక్ యూరీనల్స్, మున్సిపల్ ప్రైవేట్ బస్టాండ్ వద్ద గల ఖాళీ స్థలలు, ఖాళీగా ఉన్న జనరల్ షాపు రూములు, ఖాళీగా ఉన్న ఐ.డీ.ఎస్.యం.టీ. షాపు రూములకు వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అన్నమయ్య జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పిలుపునిచ్చారు. పాఠశాలల వద్ద ప్రత్యేక నిఘా పెట్టి డ్రగ్స్ నెట్‌వర్క్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 112 మంది అనుమానితులపై నిఘా కొనసాగుతుందని వెల్లడించారు. సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1972ను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
JGL: ముస్లీం మైనార్టీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల మాతా శిశు కేంద్రంలో హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి సుజాత, జిల్లా ఉప వైద్యాధికారి శ్రీనివాస్, డాక్టర్ విజయ్ రెడ్డి పాల్గొన్నారు.
TG: రాఘవ కన్‌స్ట్రక్షన్స్ మంత్రి పొంగులేటిది కాదని సీఎం రేవంత్ అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ డైరెక్టర్లు పొంగులేటి సతీమణి మాధురి, కుమారుడు హర్షరెడ్డి అని స్పష్టం చేశారు. శ్రీనివాస్‌రెడ్డికి సతీమణి, కుమారుడు.. తమ్ముడు దూరపు బంధువులా..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
AP: ఎవరైనా అమరావతిని అడ్డుకునే కుట్రలు చేస్తే సహించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఏపీలో సుదీర్ఘకాలం సీఎంగా, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్నానని తెలిపారు. ఏపీ ఆత్మ అయితే అమరావతి గుండె అని పేర్కొన్నారు. అమరావతి తమది అని ప్రతి ఒక్కరూ చెప్పుకునేలా అభివృద్ధి చేస్తామన్నారు. ఇక ఎవరూ అమరావతిని ఏమీ చేయలేదని ధీమా వ్యక్తం చేశారు.