• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కలెక్టర్‌ను కలిసిన చీర్కపల్లి ప్రజాప్రతినిధులు

WNP: చీర్కపల్లి గ్రామ సర్పంచ్ పగడాల రవి నేతృత్వంలో ఉపసర్పంచ్ పరుశురాములు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జమ్మి మల్లేష్, వార్డ్ సభ్యులు దొడ్ల కాశీమ్లు వనపర్తి జిల్లా కలెక్టర్ను కలిశారు. గ్రామ అభివృద్ధికి సంబంధించి విస్తృతంగా చర్చించారు. గ్రామంలో జరుగుతున్న పనులు, భవిష్యత్ ప్రణాళికల గురించి కలెక్టర్కు వివరించారు.

March 25, 2026 / 06:46 PM IST

CPIML లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా బందు క్రాంతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ మాట్లాడుతూ.. పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా బందు క్రాంతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యలపై పోరాటాలకు నూతన కమిటీ నిరంతరం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

March 25, 2026 / 06:45 PM IST

‘గర్భస్థ నిర్ధారణ పూర్తిగా నిషేధం’

SRCL: గర్భస్థ నిర్ధారణ పూర్తిగా నిషేధమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. సిరిసిల్లలో స్కానింగ్ సెంటర్ల యజమానులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎవరైనా గర్భస్థ పిండ నిర్ధారణ చేస్తే రూ 10 వేల జరిమానాతో పాటు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారన్నారు. స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలు పాటించాలన్నారు.

March 25, 2026 / 06:44 PM IST

ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి చర్యలు: కలెక్టర్

MNCL: జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ సమస్యలను పరిష్కరించి బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

March 25, 2026 / 06:44 PM IST

‘వాహనదారులు అన్ని అనుమతి పత్రాలు కలిగి ఉండాలి’

SRPT: వాహనదారులు అన్ని అనుమతి పత్రాలు కలిగి ఉండాలని, నిబంధనల ప్రకారం వాహనాలు నడపాలని ఎస్సై క్రాంతికుమార్ అన్నారు. బుధవారం తుంగతుర్తిలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా డ్రైవర్లకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ బాధ్యతగా నడుచుకోవాలని, రోడ్డు నియమ నిబంధనలను పాటించాలన్నారు.

March 25, 2026 / 06:42 PM IST

టీడీపీ బలోపేతంపై క్లస్టర్ శిక్షణ

KRNL: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన క్లస్టర్ ట్రైనింగ్ కార్యక్రమంలో క్లస్టర్ కన్వీనర్ గణేకల్లు విరూపాక్షి ఇవాళ పాల్గొన్నారు. రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ సహా నేతలు శిక్షణ ఇచ్చారు. రాబోయే స్థానిక ఎన్నికలు, 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని సూచించినట్లు ఆయన తెలిపారు.

March 25, 2026 / 06:41 PM IST

GOOD NEWS.. గడువు పెంపు

MHBD:ఎస్సీ యాక్షన్ ప్లాన్ ద్వారా స్వయం ఉపాధి పొందే ఎస్సీ యువత కొరకు దరఖాస్తుల గడువు ఏప్రిల్ 2 వరకు పొడిగించినట్లు కార్యనిర్వాహక అధికారి శ్రీనివాసరావు తెలిపారు.జిల్లాల్లో 70 నుంచి 90% సబ్సిడిపై EV టూవీలర్లు, ఆటోలు,సోలార్ పంపుసెట్లను ప్రభుత్వం అందిస్తోందన్నారు. అర్హుత గలవారు ఏప్రిల్ 2లోగా tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

March 25, 2026 / 06:40 PM IST

పెద్దింట్లమ్మ ఆదాయం ఎంతంటే..!

ఏలూరు: జిల్లా కైకలూరు మండలం కొల్లేటి కోట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పెద్దింటి అమ్మవారి దేవాలయం నందు ఈ రోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. 91 రోజులకు గాను రూ. 29,65,308 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి కే. శ్రీనివాస్ తెలిపారు. అలాగే అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

March 25, 2026 / 06:40 PM IST

సీఎం చంద్రబాబుకు అధికారుల స్వాగతం

గుంటూరులో జరిగిన ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహానికి సీఎం చంద్రబాబు హాజరైన విషయం తెలిసందే. ఈ సందర్భంగా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్, జీఎంసీ కమిషనర్ మయూర్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. సీఎం రాకతో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది.

March 25, 2026 / 06:40 PM IST

పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

పెట్రోల్ ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు, రూపాయి విలువ తగ్గడం. భారత్ ఎక్కువగా ఆయిల్ దిగుమతులపై ఆధారపడుతుంది. అందువల్ల గ్లోబల్ మార్కెట్ ప్రభావం నేరుగా పడుతుంది. రూపాయి విలువ తగ్గితే దిగుమతి ఖర్చు పెరుగుతుంది. అదనంగా ప్రభుత్వం విధించే పన్నులు, రవాణా ఖర్చులు కూడా ధరలను ప్రభావితం చేస్తాయి. ఇటీవల యుద్ధ పరిస్థితులు చమురు ధరలు పెరగడానికి ప్రధాన కారణం.

March 25, 2026 / 06:38 PM IST

అక్రమ ఇసుక రవాణా.. 2 ట్రాక్టర్లు సీజ్

KNR: వీణవంక మండలం రామకృష్ణాపూర్‌లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. SI ఆవుల తిరుపతి వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం హనుమాన్ గుడి సమీపంలో తనిఖీలు నిర్వహించగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు డ్రైవర్లు పూదరి సంతోశ్, సంపంగి రాములు, యజమాని పెరిమల్ల రాజయ్యపై కేసు నమోదు చేశారు. అక్రమ ఇసుక రవాణా చేస్తే ఎంతటి వారినైనా వదలమని అన్నారు.

March 25, 2026 / 06:37 PM IST

రుణాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

MBNR: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా అందించే రుణాలపై అవగాహన లేని ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా అన్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సర్వసభ్య సమావేశానికి బుధవారం కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చిన్న సన్నకారు రైతులకు రుణాలు ఇచ్చి వారికి సహకరించాలని కోరారు.

March 25, 2026 / 06:36 PM IST

దివ్యాంగులకు త్రీ వీలర్ల ఎంపిక శిబిరం

సత్యసాయి: జిల్లాలో రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ త్రీ వీలర్ల కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు బుధవారం అర్హత శిబిరం నిర్వహించారు. సంయుక్త కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధ్యక్షతన పీజీఆర్‌ఎస్ హాల్‌లో ఈ ఇంటర్వ్యూలు జరిగాయి. ఆరు నియోజకవర్గాలకు చెందిన 94 మంది విభిన్న ప్రతిభావంతులు ఈ శిబిరానికి హాజరయ్యారు. జిల్లా కమిటీ సభ్యులు అభ్యర్థుల అర్హతలను పరిశీలించారు.

March 25, 2026 / 06:35 PM IST

పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

SKLM: జి.సిగడాం మండలం వెంకయ్యపేట పంచాయితీ సర్పంచ్ మామిడి ధనలక్ష్మి స్వర్గస్తులైనారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆయన స్వగృహానికి వెళ్ళి నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చి, దైర్యం చెప్పి ప్రగాడ సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కాయల రమణ, ఎంపీపీ ప్రతినిది మీసాల రమణ ఉన్నారు.

March 25, 2026 / 06:35 PM IST

చైన్ స్నాచింగ్ నిందితుడి కోసం గాలింపు

ఖమ్మం నగరంలోని గుట్టల బజార్ రాధాకృష్ణ ఆసుపత్రి సమీపంలో సోమవారం మధ్యాహ్నం దొంగతనం జరిగింది. హోండా షైన్ బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి ఓ వృద్ధురాలి మెడలోని మూడు తులాల బంగారు గొలుసును తెంచుకుపోయాడు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడి ఫోటోలను త్రీ టౌన్ పోలీసులు బుధవారం విడుదల చేశారు. నిందితుడిని గుర్తిస్తే 8712659115కు సమాచారం అందించాలన్నారు.

March 25, 2026 / 06:35 PM IST