KNR: వీణవంక మండలం రామకృష్ణాపూర్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. SI ఆవుల తిరుపతి వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం హనుమాన్ గుడి సమీపంలో తనిఖీలు నిర్వహించగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు డ్రైవర్లు పూదరి సంతోశ్, సంపంగి రాములు, యజమాని పెరిమల్ల రాజయ్యపై కేసు నమోదు చేశారు. అక్రమ ఇసుక రవాణా చేస్తే ఎంతటి వారినైనా వదలమని అన్నారు.