విజయనగరం, అనకాపల్లి జిల్లాల అనుసంధ కల్వర్ట్ కూలిపోవడంతో రెండు జిల్లాలకు రాకపోకలు తెగిపోయాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ప్రత్యేక చొరవ తీసుకొని యుద్ధప్రాతిపదికన నిధులు మంజూరు చేసి కల్వర్ట్ను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాడుగుల ఎమ్మెల్యేతో కలిసి బుధవారం ప్రారంభించారు.