TG: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. వచ్చే రెండు రోజులు ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉన్నా, ఆ తర్వాత ఎండలు మళ్లీ ముదిరే ఛాన్స్ ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరగవచ్చని అధికారులు హెచ్చరించారు.