ASF: కాగజ్ నగర్ మండలం ఈజ్ గావ్ పోలీస్ స్టేషన్ నూతన SIగా చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన SI కళ్యాణ్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.