ADB: కెరమెరి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చెర్ల నాగప్ప అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ శుక్రవారం రాత్రి వారి నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నాగప్ప పార్టీకి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు.