KKD: గండేపల్లి మండలం సూరంపాలెంలో విషాద ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. లోన్ యాప్లో తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనకాపల్లి జిల్లా వడ్డాది మాడుగుల గ్రామానికి చెందిన మహమ్మద్ బషీర్ (22) ఆదిత్య యూనివర్సిటీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అప్పు ఒత్తిడి తట్టుకోలేక మనస్తాపానికి గురై తన గదిలో ఉరేసుకున్నాడు.