NRPT: నారాయణపేట మండలం కొల్లంపల్లిలో ప్రజా రవాణా అటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై ఎస్సై గాయత్రి అవగాహన కల్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లారాదని అన్నారు.